బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ భారీ చిత్రం “జవాన్” కోసం అందరికీ తెలిసిందే. కోలీవుడ్ స్టార్ దర్శకుడు అట్లీ తెరకెక్కించిన ఈ చిత్రంపై సెన్సేషనల్ హైప్ అయితే ఈ చిత్రంపై నెలకొంది. ఇక ఈ చిత్రం షారుఖ్ గత బిగ్గెస్ట్ హిట్ “పఠాన్” తర్వాత అయితే వస్తున్నా సినిమా ఇది కావడంతో పాన్ ఇండియా లెవెల్ ఆడియెన్స్ ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇక ఈ చిత్రంలో దీపికా పదుకోన్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి లాంటి బిగ్ స్టార్స్ కూడా నటించారు. అయితే ఈ చిత్రంపై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బాలీవుడ్ వర్గాల నుంచి అయితే వినిపిస్తుంది. వారి మాట ప్రకారం ఈ చిత్రానికి మేకర్స్ షారుఖ్ ఖాన్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ ని అయితే పెట్టినట్టుగా తెలుస్తుంది.
ఇప్పటికి షారుఖ్ గత చిత్రం “పఠాన్” తన కెరీర్ లో హైయెస్ట్ బడ్జెట్ సినిమా కాగా జవాన్ కి అయితే ఏమగా 300 కోట్ల బడ్జెట్ పెట్టినట్టుగా తెలుస్తుంది. దీనితో ఇదే తన కెరీర్ లో హైయెస్ట్ బడ్జెట్ అని టాక్. మరి ఇప్పటికే ట్రైలర్ టీజర్ లలో అయితే ఆ గ్రాండియర్ కనిపించింది. ఇక ఫుల్ ఫ్లెడ్జ్ గా సినిమా ఎలా ఉంటుందో చూడాలి.


