‘ఐశ్వర్య రాయ్’ పై జయాబచ్చన్ కామెంట్స్ వైరల్

‘ఐశ్వర్య రాయ్’ పై జయాబచ్చన్ కామెంట్స్ వైరల్

Published on Aug 5, 2024 10:49 AM IST

అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ విడాకులు తీసుకుంటున్న వార్త చాలా రోజులుగా సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది. దీనికితోడు, అనంత్ అంబానీ పెళ్లిలో కూడా ఐశ్వర్యరాయ్‌ ఒంటరిగా కనిపించడంతో ఈ రూమర్ కి బలాన్ని చేకూర్చింది. ఈ నేపథ్యంలో గతంలో జయాబచ్చన్ చేసిన కామెంట్స్ తాజాగా మళ్లీ వైరల్‌ అయ్యాయి. ఇంతకీ, ఆ కామెంట్స్ సారాంశం ఏమిటంటే.. ‘ఐశ్వర్యని చూసినప్పుడల్లా అమితాబ్ చాలా సంతోషంగా ఫీల్ అవుతారు.

ఆయన ఐశ్వర్యను ఎప్పుడూ కోడలుగా భావించలేదు. ఓ కూతురిలా చూసుకుంటారు. మా కూతురు శ్వేత బచ్చన్ అంటే అమితాబ్‌కు చాలా ఇష్టం. శ్వేత పెళ్లయ్యాక ఆ స్థానాన్ని ఐశ్వర్య భర్తీ చేసింది’ అంటూ జయాబచ్చన్ చెప్పుకొచ్చింది. అప్పుడెప్పుడో జయాబచ్చన్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మరోవైపు అభిషేక్ బచ్చన్ – ఐశ్వర్య రాయ్ విడాకుల వార్తల్లో వాస్తవం లేకపోతే.. ఎందుకు ఆ వార్త పై బచ్చన్ ఫ్యామిలీ ఇంకా స్పందించడం లేదు అంటూ నెటిజన్లు పోస్ట్ లు పెడుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు