ఇటీవల మలయాళ చిత్ర పరిశ్రమలో పలు సినిమాలు మంచి విజయాలు అందుకున్నాయి. అందులో ఒక మూవీ జయ జయ జయ జయ హే. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ మూవీలో దర్శన రాజేంద్రన్, బాసిల్ జోసెఫ్ ప్రధాన పాత్రలు పోషించగా విపిన్ దాస్ దీనిని తెరకెక్కించారు. ఇక తాజాగా ఈ మూవీని తెలుగులో ఎస్ ఒరిజినల్స్, మూవీ వెర్స్ ఇండియా సంస్థలు గ్రాండ్ గా రీమేక్ చేస్తున్నాయి.
ఏఆర్ సజీవ దర్శకత్వం వహిస్తున్న ఈమూవీలో నటుడు, దర్శకుడైన తరుణ్ భాస్కర్ కీలక పాత్ర చేస్తుండగా ఆయనకు జోడీగా యువ నటి ఈషా రెబ్బా నటిస్తున్నట్లు కన్ఫర్మ్ అయింది. ఇక నేడు ఈషా పుట్టినరోజు సందర్భంగా షూటింగ్ బ్రేక్ లో ఆమె బర్త్ డే ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసారు మేకర్స్. ఈ సందర్భంగా వారు దిగిన ఫోటోలని తమ సోషల్ మీడియా ప్రొఫైల్స్ లో షేర్ చేసారు మేకర్స్. కాగా ఈ మూవీని మన తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా దర్శకుడు అద్భుతంగా తెరకెక్కిస్తున్నట్లు చెప్తోంది మూవీ టీమ్. త్వరలో టైటిల్ మరియు ఫస్ట్ లుక్ రిలీజ్ కానున్న ఈ మూవీని సృజన్ యరబ్రోలు, వివేక్ కృష్ణాని, సాధిక్, ఆదిత్య పిట్టీ నిర్మిస్తున్నారు.
The Team of @SOriginals1 Production No.11 celebrates the birthday of Gorgeous @YoursEesha on the sets????❤️
The hilarious Entertainer starring #TharunBhascker & #EeshaRebba shoot is progressing at a brisk pace in Rajahmundry????
Title & First Look soon????
Directed by #SajeevAR pic.twitter.com/75fTVBtsfi
— S Originals (@SOriginals1) April 19, 2024