తమిళ స్టార్ హీరో జయం రవి తన దాంపత్య జీవితం పై సంచలన ప్రకటన చేశారు. తన భార్యతో తాను విడాకులు తీసుకుంటున్నట్లు జయం రవి ప్రకటించడంతో ఈ వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నిజానికి గత కొన్ని రోజులుగా జయం రవి తన భార్య ఆర్తితో విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. నేడు ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ జయం రవి పోస్ట్ పెట్టారు.
ఇంతకీ, తన పోస్ట్ లో జయం రవి ఏం చెప్పారంటే.. ‘జీవితం ఎన్నో అధ్యాయాలతో నిండిన ప్రయాణం. ఎవరైనా వారి జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీలో చాలామంది నన్ను ఆదరించి నాకు మద్దతుగా నిలిచారు. అందుకే నేనెప్పుడు నా ఫ్యాన్స్ తో, మీడియాతో నిజాయతీగా ఉండాలని భావిస్తాను. ఓ విషయాన్ని భారమైన హృదయంతో మీకు చెప్పాల్సి వస్తోంది. ఎన్నో ఆలోచనలు, చర్చల తర్వాత నేను, నా భార్య ఆర్తి విడాకులు తీసుకోవాలనే కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నాం. మా ఇద్దరి మంచి కోసమే ఇలా చేస్తున్నాం’ అంటూ జయం రవి క్లారిటీ ఇచ్చారు.