చాలా కాలం తరువాత జయంత్ సి పరాన్జీ వార్తలలోకి ఎక్కాడు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్ వంటి అగ్ర కదానయకులందరితోనూ పనిచేసిన ఆయన ఖాతాలో ‘ప్రేమించుకుందాం రా’, ‘బావగారూ బాగున్నారా’, ‘లక్ష్మీ నరసింహా’ వంటి సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. తెలుగులో అతని ఆఖరి సినిమా ‘తీన్ మార్’ లో పవన్ కళ్యాణ్ సరసన త్రిష మరియు కృతి కర్బంధ జంటగా నటించారు.
పెద్ద తారలతో పనిచేసే సెంటిమెంట్ ఉన్న అతను ఇప్పుడు కన్నడలో అగ్ర కధానాయకుడు అయిన పునీత్ రాజ్ కుమార్ హీరోగా ఒక సినిమా తియ్యనున్నాడు. ఈ ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ త్వరలోనే మొదలుకానుంది.