‘జెర్సీ’ మాకు మంచి ప్రాఫిటబుల్ ఫిలిం – నిర్మాత నాగవంశీ

‘జెర్సీ’ మాకు మంచి ప్రాఫిటబుల్ ఫిలిం – నిర్మాత నాగవంశీ

Published on Oct 15, 2023 4:01 PM IST

నాచురల్ స్టార్ నాని హీరోగా శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా యువ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో 2019లో తెరకెక్కిన మూవీ జెర్సీ. మంచి లవ్, యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద విజయం అందుకుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ గ్రాండ్ లెవెల్లో నిర్మించిన ఈ మూవీ ఆ తరువాత హిందీ లో రీమేక్ కాబడి అక్కడ కూడా విజయం అందుకుంది.

ఇక తాజాగా నాని హీరోగా తెరకెక్కుతున్న హాయ్ నాన్న మూవీ యొక్క టీజర్ లాంచ్ ఈవెంట్ లో భాగంగా జెర్సీ, శ్యామ్ సింగరాయ్ మూవీస్ రెండూ కూడా సక్సెస్ అయినప్పటికీ బ్రేక్ ఈవెన్ అందుకోలేక కాస్ట్ ఫెయిల్యూర్స్ అయ్యాయి కదా అంటూ ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు నాని ఈ విధంగా సమాధానం ఇచ్చారు.

నిజానికి జెర్సీ మూవీ పెట్టుబడి కంటే ఐదు రెట్లు ఎక్కువగా రాబట్టిందని, ఓటిటి రైట్స్ వంటి నాన్ థియేట్రికల్ రెవెన్యూ ఆ మూవీకి ఎంతో లభించిందని అన్నారు. అయితే తాజాగా దీని పై నిర్మాత నాగవంశీ తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా స్పందించారు. జెర్సీ మూవీ తమకు మెమొరబుల్ మాత్రమే కాదు మంచి ప్రాఫిట్స్ కూడా తెచ్చిపెట్టిందని అన్నారు. ఆ మూవీ బెస్ట్ ఫీచర్ ఫిలిమ్ గా నేషనల్ అవార్డు కూడా దక్కించుకున్న విషయం తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు