గ్రాండ్‌గా ‘ఝాన్సీ ఐపీఎస్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్

గ్రాండ్‌గా ‘ఝాన్సీ ఐపీఎస్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్

Published on Nov 26, 2024 8:50 AM IST

ఆర్ కె ఫిలిమ్స్ పతాకంపై ప్రతాని రామకృష్ణ గౌడ్ నిర్మాతగా, బ్యూటీ క్వీన్ లక్మీ రాయ్ ప్రధాన పాత్రలో గురుప్రసాద్ దర్శకత్వంలో తమిళంలో విడుదలై ఘన విజయాన్ని సాధించిన “ఝాన్సీ ఐపీఎస్” చిత్రం ఈనెల 29న తెలుగులో గ్రాండ్‌గా విడుదలకు సిద్దమైంది. తాజాగా “ఝాన్సీ ఐపీఎస్” సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ..‘కర్తవ్యం వంటి లేడీ ఓరియెంటెడ్ పోలీస్ స్టోరీతో ఘన విజయాన్ని అందుకున్న నిర్మాత ఏఎం రత్నం గారు మా “ఝాన్సీ ఐపీఎస్” ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అతిథిగా రావడం సంతోషంగా ఉంది. ఈ చిత్రంలో లక్మీ రాయ్ త్రిపాత్రాభినయం చేశారు. భూ కబ్జాలు చేసి బిల్డింగ్స్ కట్టిన వారి భవనాలు కూల్చే ఐపీఎస్ ఆఫీసర్ గా లక్ష్మీరాయ్ కనిపిస్తారు. ఆమె పాత్ర చూస్తే ఇప్పటి హైడ్రా గుర్తుకు వస్తుంది. అలాగే గ్లామరస్ గా ఉండే మరో క్యారెక్టర్ తో పాటు డ్రగ్స్ ముఠాను వేటాడే పాత్రలో ఆమె నటించారు. ఫైట్ మాస్టర్ థ్రిల్లర్ మంజు 8 ఫైట్స్ కంపోజ్ చేశారు. ఈ నెల 29న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు మా మూవీని తీసుకొస్తున్నాం. మీ సపోర్ట్ ఇలాగే ఉంటుందని కోరుకుంటున్నా.’ అని అన్నారు.

నటి అక్సాఖాన్ మాట్లాడుతూ.. “ఝాన్సీ ఐపీఎస్” సినిమా ట్రైలర్‌కు నేను బాగా కనెక్ట్ అయ్యాను. నేను డ్యాన్సర్, జిమ్నాస్ట్ ను. నేను కోరుకునే ఎలిమెంట్స్ ఈ మూవీలో ఉన్నాయి. ఈ నెల 29న ఈ చిత్రాన్ని థియేటర్స్ లో మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి చూడండి. తమిళం, మలయాళం కంటే తెలుగులో “ఝాన్సీ ఐపీఎస్” పెద్ద సక్సెస్ కావాలి.’ అని అన్నారు.

నిర్మాత ఏఎం రత్నం మాట్లాడుతూ.. ‘సినిమాలు ఎందరికో స్ఫూర్తినిస్తాయి. నా కర్తవ్యం మూవీ చూసి చాలామంది అమ్మాయిలు పోలీస్ డిపార్ట్ మెంట్ లోకి వచ్చేందుకు ఆసక్తి చూపించారు. అలాగే భారతీయుడు మూవీ చూసి కొందరు ఉద్యోగులు లంచాలు తీసుకోవద్దనే నిర్ణయానికి వచ్చారు. బాయ్స్ సినిమా చూసి ఇంట్లోంచి బయటకు వచ్చి సినిమాల కోసం ప్రయత్నించానని కేజీఎఫ్ హీరో యష్ నాతో చెప్పారు. అలా సినిమా మాధ్యమం ఎంతోమందికి స్ఫూర్తిని అందిస్తుంది. “ఝాన్సీ ఐపీఎస్” ట్రైలర్ చూశాను చాలా బాగుంది. లక్ష్మీరాయ్ యాక్షన్ బాగా చేయగలదు. ఈ సినిమాతో రామకృష్ణ గౌడ్ గారికి మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నా.’ అని అన్నారు.

నటుడు సుమన్ మాట్లాడుతూ.. ‘రత్నం గారు ఎన్నో గొప్ప సినిమాలు నిర్మించారు. అప్పట్లో మేము చేసిన మూవీస్ చూసి యూత్ ఇన్స్‌పైర్ అయ్యేవాళ్లు. కరాటే, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునేవాళ్లు. ఇప్పుడు మహిళలు మరింతగా పోలీస్ డిపార్ట్‌మెంట్ లోకి రావాల్సిన అవసరం ఉంది. “ఝాన్సీ ఐపీఎస్” సినిమా ఆ స్ఫూర్తిని ప్రేక్షకుల్లో కలిగిస్తుందని ఆశిస్తున్నాను.’ అని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు