ఓటిటి సమీక్ష : “ఝాన్సీ సీజన్ 2” – తెలుగు సిరీస్ డిస్నీ+ హాట్ స్టార్ లో

ఓటిటి సమీక్ష : “ఝాన్సీ సీజన్ 2” – తెలుగు సిరీస్ డిస్నీ+ హాట్ స్టార్ లో

Published on Jan 19, 2023 11:07 PM IST
Jhansi Movie-Review-In-Telugu

విడుదల తేదీ : జనవరి 19, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు: అంజలి, చాందిని చౌదరి, ఆదర్శ్ బాలకృష్ణ, రాజ్ అర్జున్, అబీరామ్ వర్మ, రామేశ్వరి తాళ్లూరి, తదితరులు

దర్శకుడు : తిరు

నిర్మాతలు: కృష్ణ కులశేఖరన్, కె.ఎస్. మధుబాల

సంగీత దర్శకులు: శ్రీచరణ్ పాకాల

సినిమాటోగ్రఫీ: ఆర్వీ

ఎడిటర్: ఆంథోని

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

లేటెస్ట్ గా ఓటిటి లోకి పలు చిత్రాలతో పాటుగా పలు ఆసక్తికర సిరీస్ లు కూడా విడుదల అవుతున్నాయి. మరి అలా ప్రముఖ ఓటిటి యాప్ హాట్ స్టార్ లో కొన్నాళ్ల కితం వచ్చి హిట్ అయ్యిన సిరీస్ కి సీక్వెల్ అయినటువంటి ఝాన్సీ సీజన్ 2 ఇప్పుడు రిలీజ్ అయ్యింది. నటి అంజలి నటించిన ఈ సిరీస్ ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి.

 

కథ :

 

ఇక కథలోకి వస్తే.. గత సీజన్ ఎక్కడైతే ఆగిందో ఈసారి సరిగ్గా అక్కడ నుంచే మొదలవుతుంది.. ఝాన్సీ గా పిలవబడే మహిత(అంజలి) తన గతంలో ఉన్న పాత్రలు అమీషా(నీతూ), బార్బీ(చాందిని చౌదరి) అలాగే దిళ్లు(సురేష్ చక్రవర్తి) ల గురించి తెలుసుకుంటుంది. మరి వీరు హ్యూమన్ ట్రాఫికింగ్ చేసే కాలబ్ (రాజ్ అర్జున్) టీం లో ఎలా భాగస్వామ్యం అయ్యారు? బార్బీ కూడా ఎందుకు అతనితో చేరాల్సి వస్తుంది? మరి ఈ కాలబ్ పై ఝాన్సీ పాగా తీర్చుకుంటుందా లేదా ఈ సిరీస్ ఇదే ముగింపా కొనసాగింపు కూడా ఉందా అనేది తెలుసుకోవాలి అంటే ఈ సిరీస్ ని చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

 

గత సీజన్లో అయితే అంజలి తన ఇంటెన్స్ యాక్షన్ స్టంట్స్ తో ఆకట్టుకోగా ఈసారి మాత్రం అందుకు భిన్నంగా కాస్త ఓ పెర్ఫామర్ గా మంచి నటనతో ఇంప్రెస్ చేస్తుంది. సాలిడ్ ఎమోషన్స్ తో పలు సన్నివేశాల్లో సిరీస్ ని తన భుజాలపై తీసుకుంది. అలాగే నటి చాందిని చౌదరి కి మంచి స్కోప్ దక్కింది.

తాను కూడా మంచి నటనతో ఆకట్టుకొడమే కాకుండా తన పాత్రపై అల్లుకున్న కథ కూడా చాలా బాగుంటుంది. తనకి అలాగే అంజలి మధ్య ఉన్న ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా మెప్పించేలా అనిపిస్తుంది. వీటితో పాటుగా ఫ్లాష్ బ్యాక్ లో సన్నివేశాలు బాగున్నాయి.

ఇక వీటితో పాటుగా సిరీస్ లో యాక్షన్ బ్లాక్ లు మళ్లీ ఇంప్రెస్ చేస్తాయి. మంచి స్క్రీన్ ప్లే పలు సన్నివేశాల్లో ఎంగేజింగ్ గా ఉంటుంది. అలాగే హ్యూమన్ ట్రాఫికింగ్ కి సంబంధించిన సీన్స్ కూడా ఇంట్రెస్ట్ గా సాగుతాయి. ఇక మెయిన్ లీడ్ తో పాటుగా అభిరామ్ వర్మ, రాజ్ అర్జున్ తదితర నటులు తమ పాత్రలకు న్యాయం చేకూర్చారు.

 

మైనస్ పాయింట్స్ :

 

ఇందులో ఎలా అయితే కొన్ని అంశాలు ఆకట్టుకునే విధంగా ఉన్నాయో అదే విధంగా మరికొన్ని అంశాలు కాస్త డిజప్పాయింట్ చేసే విధంగా ఉన్నాయి. సిరీస్ లో కనిపించే కొన్ని సబ్ ప్లాట్ లు వాటిలో కనిపించే పాత్రలు సిరీస్ ని ల్యాగ్ చేసినట్లు అనిపిస్తుంది. చాలా కీలక సన్నివేశాల్లో వచ్చే ఈ సబ్ ప్లాట్ లు మంచి ఫ్లో ని దెబ్బ తీశాయి.

అలాగే ఈ కొన్ని అనవసర సన్నివేశాలు తీయకపోవడం మూలాన మిగతా బాగుండే సీన్స్ చప్పబడిపోతాయి. ఇంకా ఈ తరహా సిరీస్ లకు గ్రిప్పింగ్ నరేషన్ తప్పనిసరి కానీ ఇది కూడా సిరీస్ లో మిస్ అవుతుంది.

ఇక వీటి అన్నింటి కన్నా పెద్ద డిజప్పాయింట్ చేసే అంశం ఏదన్నా ఉంది అంటే అది సరైన ముగింపు లేకపోవడం అని చెప్పాలి. పైగా ఇది మెప్పించేలా లేకపోగా మరో సీజన్ కి హింట్ ఇవ్వడం ఇంప్రెసివ్ గా అనిపించదు. అలాగే చాలా సీన్స్ రొటీన్ రివెంజ్ డ్రామా చూస్తున్నట్టు అనిపించక మానదు.

 

సాంకేతిక వర్గం :

 

ఈ సిరీస్ లో నిర్మాణ విలువలు బాగున్నాయి. అలాగే శ్రీచరణ్ పాకాల స్కోర్ అండ్ ఓ సాంగ్ బాగున్నాయి. అర్వి సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. ఆంటోనీ ఎడిటింగ్ పర్వాలేదు కానీ కొన్ని సీన్స్ ట్రిమ్ చేయాల్సింది. అయితే మొదటి సీజన్ తో పోలిస్తే బెటర్ అని చెప్పొచ్చు.

ఇక దర్శకుడు తిరు విషయానికి వస్తే.. తన వర్క్ జస్ట్ ఒకే అని మాత్రం చెప్పాలి. గణేష్ కార్తిక్ రచన ఇంకా బాగుండి ఉంటే బాగుండేది. ఇప్పటికే యావరేజ్ ట్రీట్ ఇచ్చే సిరీస్ లో ఇంకా మంచి ఎంగేజింగ్ సన్నివేశాలు పెట్టి ఉంటే బాగుండేది. మంచి స్క్రీన్ ప్లే కూడా యాడ్ చేసి ఉంటే ఈ సిరీస్ డెఫినెట్ గా మంచి రీచ్ అందుకునే ఛాన్స్ ఉంది.

 

తీర్పు :

 

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఝాన్సీ కి కొనసాగింపు గా వచ్చిన ఈ సిరీస్ లో అంజలి సహా మరికొన్ని పాత్రలు పెర్ఫార్మన్స్ పరంగా ఆకట్టుకుంటారు. అలాగే కొన్ని సీన్స్ మరియు ఎమోషన్స్ బాగున్నాయి. కానీ నరేషన్ ఇంకా ఎంగేజింగ్ గా చేయాల్సి ఉంది. స్క్రీన్ ప్లే కూడా కరెక్ట్ గా ఉండి ఉంటే ఈ సిరీస్ ఇంకో లెవెల్లో ఉండేది. కానీ ఇది జస్ట్ యావరేజ్ గానే అనిపిస్తుంది.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు