రాఘవ లారెన్స్, ఎస్. జే. సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన జిగర్ తండ డబుల్ ఎక్స్ ఈ రోజు వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో గ్రాండ్ రిలీజ్ అయ్యింది. డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని స్టోన్ బెంచ్ ఫిల్మ్స్, ఫైవ్ స్టార్ క్రియేషన్స్ బ్యానర్ల పై నిర్మించడం జరిగింది. ఈ చిత్రం మంచి ఓపెనింగ్స్ ను రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, ఈ సినిమా తన నాన్ థియేట్రికల్ పార్ట్ నర్స్ ను ఫిక్స్ చేసుకుంది.
ప్రముఖ టీవీ ఛానల్ అయిన జెమిని టీవీ ఛానల్ ఈ సినిమాకి సంబందించిన శాటిలైట్ హక్కులను సొంతం చేసుకుంది. అదే విధంగా ప్రముఖ ఓటిటి దిగ్గజం అయిన నెట్ ఫ్లిక్స్ ఈ సినిమాకి సంబందించిన డిజిటల్ హక్కులని దక్కించుకుంది. సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈ సినిమా పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.