సమీక్ష : జిగర్‌ తండ డబుల్‌ ఎక్స్‌ – రొటీన్ యాక్షన్ తో సాగే పీరియాడికల్‌ డ్రామా !

సమీక్ష : జిగర్‌ తండ డబుల్‌ ఎక్స్‌ – రొటీన్ యాక్షన్ తో సాగే పీరియాడికల్‌ డ్రామా !

Published on Nov 11, 2023 3:03 AM IST
Jigarthanda DoubleX Movie Review in Telugu

విడుదల తేదీ : నవంబర్ 10, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు: రాఘవ లారెన్స్ , ఎస్‌జే సూర్య, షైన్ టామ్ చాకో, నవీన్ చంద్ర, సత్యన్, అరవింద్ ఆకాష్, ఇళవరసు తదితరులు

దర్శకుడు : కార్తీక్ సుబ్బరాజ్

నిర్మాతలు: కార్తేకేయన్ సంతానం, ఎస్ కతిరేసన్, అలంకార్ పాండియన్

సంగీతం: సంతోష్ నారాయణన్

సినిమాటోగ్రఫీ: తిర్రు

ఎడిటర్: షఫీక్ మొహమ్మద్ అలీ

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

రాఘవ లారెన్స్, ఎస్‌జే సూర్య ప్రధాన పాత్రల్లో వచ్చిన పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామా జిగర్‌ తండ డబుల్‌ ఎక్స్‌. తమిళంలో క్రియేటీవ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న కార్తీక్ సుబ్బరాజు ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. కాగా ఈ చిత్రం ఈ రోజు రిలీజ్ అయింది. మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

 

కథ :

 

రాఘవ లారెన్స్ (అలియాస్ సీజర్) కర్నూలులో ఓ రౌడీ. ఓ రాజకీయ నాయకుడికి అనుగుణంగా పని చేస్తుంటాడు. మరోవైపు ఎస్‌జే సూర్య (రే దాసన్) పోలీస్ కావాలని కలలు కంటూ అనుకోకుండా ఓ మర్డర్ కేసులో అరెస్ట్ అవుతాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఎస్‌జే సూర్య, రాఘవ లారెన్స్ ను చంపడానికి ఒప్పుకుంటాడు. అసలు రాఘవ లారెన్స్ ను ఎవరు చంపాలని అనుకుంటున్నారు?, ఎస్‌జే సూర్యనే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు ?, ఈ మొత్తం వ్యవహారం వెనుక ఉన్న వ్యక్తి ఎవరు ?, చివరకు ఈ కథ ఎలా ముగుస్తోంది? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

 

పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాగా సాగిన ఈ ఫిల్మ్ లో కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ అండ్ గుడ్ యాక్షన్ సీన్స్ బాగున్నాయి. ముఖ్యంగా రాఘవ లారెన్స్ – ఎస్‌జే సూర్య పాత్రలు, వాటి చిత్రీకరణ అలాగే వారి గెటప్స్ అండ్ సెటప్ బాగున్నాయి. పైగా సినిమాలో ట్రైబల్ నావెల్టీ కూడా బాగుంది. అన్నిటికీ కంటే ముఖ్యంగా రాఘవ లారెన్స్ సినీ కెరీర్ లో ఈ సినిమా చాలా కొత్తగా ఉంది. రాఘవ లారెన్స్, ఎస్‌జే సూర్య కూడా ఈ సినిమాలో తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు చక్కగా నటించి మెప్పించాడు.

లారెన్స్ తన బాడీ లాంగ్వేజ్ తో అలాగే, కొన్ని ఎమోషనల్ అండ్ ఫీల్ గుడ్ సీక్వెన్స్ స్ లో కూడా చాలా బాగా నటించాడు. ఇక మరో కీలక పాత్రలో నటించిన ఎస్.జె .సూర్య తన నటనతోనూ మరియు తన బాడీ ఈజ్ తోనూ ఆకట్టుకున్నాడు. విలన్ గా నటించిన షైన్ టామ్ చాకోకి పెద్దగా స్కోప్ లేదు. అయితే ఉన్నంతలో ఆయన తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. నవీన్ చంద్ర నటన కూడా సహజంగా ఉంది. సత్యన్, అరవింద్ ఆకాష్ అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. అలాగే ఈ చిత్రంలోని టేకింగ్ అండ్ మేకింగ్ స్టైల్ బాగుంది.

 

మైనస్ పాయింట్స్ :

 

ఈ జిగర్‌ తండ డబుల్‌ ఎక్స్‌ కథా నేపథ్యం, అలాగే ప్రధాన పాత్రల చిత్రీకరణ, మరియు నటీనటుల పనితీరు బాగున్నా.. కథనం విషయంలో మాత్రం దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు ఇంట్రెస్ట్ కలిగించ లేకపోయారు. ముఖ్యంగా ట్రైబల్ నేపథ్యం చుట్టూ సాగే ట్రాక్ లో రిపీటెడ్ సీన్స్ ఎక్కువైపోయాయి. దీనికితోడు ఫస్ట్ హాఫ్ లో పాత్రల మధ్య కాన్ ఫ్లిక్ట్స్, ఎమోషన్స్ కూడా వర్కౌట్ కాలేదు. ఇల్లాజికల్ పాయింట్ చుట్టూ ఫేక్ ఎమోషన్స్ తో ఫస్ట్ హాఫ్ ప్లే సాగడంతో ఈ జిగర్‌ తండ 2 కొన్ని చోట్ల నిరాశ పరిచింది.

పైగా సెకండ్ హాఫ్ మొదటి ముప్పై నిముషాలలో వచ్చే కొన్ని మెయిన్ సీన్స్ కూడా మెలో డ్రామాలా అనిపిస్తోంది. దీనికి తోడు పాత్రలు ఎక్కువ అవ్వడం, అలాగే అక్కడక్కడా యాక్షన్ కోసం పెట్టిన అమవసరమైన సీక్వెన్సెస్ సినిమా స్థాయికి తగ్గట్టు లేవు. ప్రధానంగా కొన్ని లీడ్ సన్నివేశాల్లో గ్రిప్పింగ్ నరేషన్ మిస్ అయింది. దీనికితోడు కొన్ని యాక్షన్ సన్నివేశాలు కూడా రొటీన్ గానే సాగాయి. మొత్తమ్మీద దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా ఈ సినిమాని మలచలేకపోయారు.

 

సాంకేతిక విభాగం :

 

సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. ముందే చెప్పుకున్నట్లు దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు టేకింగ్ బాగుంది. అయితే, మంచి కంటెంట్ రాసుకోవడంలో విఫలం అయ్యారు. ఆయన రాసిన స్క్రీన్ ప్లే ఇంట్రెస్టింగ్ గా లేదు. సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ అందించిన సంగీతం పర్వాలేదు. ఐతే సెకండ్ హాఫ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం కొన్ని కీలక సన్నివేశాల్లో చాలా బాగా ఆకట్టుకుంది.
తిర్రు సినిమాటోగ్రఫీ వర్క్ చాలా బాగుంది. ఇక ఎడిటర్ ఎడిటింగ్ వర్క్ కూడా పర్వాలేదు. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

 

తీర్పు :

 

జిగర్‌ తండ డబుల్‌ ఎక్స్‌ అంటూ వచ్చిన ఈ పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాలో.. స్టైలిష్ మేకింగ్, కొన్ని ఎమోషనల్ అండ్ యాక్షన్ ఎలిమెంట్స్ అలాగే రాఘవ లారెన్స్ – ఎస్.జె .సూర్య నటన సినిమాకి ప్లస్ అయ్యాయి. కానీ, ఫస్ట్ హాఫ్ లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ కావడం, కొన్ని చోట్ల స్లో నేరేషన్, మరియు బోరింగ్ సీన్స్, రెగ్యులర్ అండ్ రిపీటెడ్ సన్నివేశాలు వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి.

 

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు