బాలీవుడ్ బ్యూటీ అలియాభట్, వేదాంగ్ రైనా ప్రధాన పాత్రల్లో నటించిన ‘జిగ్రా’ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ముఖ్యంగా బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా నిరాశపరిచింది. అయితే, ఈ సినిమాని బాలీవుడ్ దర్శకుడు వాసన్ బాలా తెరకెక్కించారు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ యాక్షన్ థ్రిల్లర్ ప్లాప్ కావడంతో సోషల్‌మీడియా వేదికగా పలువురు నెటిజన్లు ఈ సినిమా పై నెగటివ్ కామెంట్స్ చేస్తూ ట్రోల్ చేశారు.
ఈ నేపథ్యంలో తన ఎక్స్ (ట్విటర్) ఖాతాను దర్శకుడు వాసన్ బాలా డీయాక్టివేట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు, దర్శకుడు వాసన్ బాలా ఇన్‌స్టా మాత్రం ఇంకా యాక్టివ్ గానే ఉంది. తమ సినిమా గురించి పాజిటివ్ రెస్పాన్స్‌లను వాసన్ బాలా ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేస్తున్నారు. ఈ పోస్ట్ ల పై కూడా కొందరు నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. మరి వాసన్ బాలా ఇన్‌స్టా ఎకౌంట్ ను కూడా డీయాక్టివేట్ చేస్తారేమో చూడాలి.