‘కుబేర’ అప్డేట్.. జిమ్ సర్బ్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్


టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్టులలో దర్శకుడు శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తున్న ‘కుబేర’ సినిమా కూడా ఒకటి. ఈ సినిమాలో స్టార్ హీరో అక్కినేని నాగార్జున, తమిళ స్టార్ హీరో ధనుష్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటిస్తుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్స్‌తో ఈ మూవీ పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేసుకుంది.

శేఖర్ కమ్ముల సినిమా అంటేనే అభిమానుల్లో గ్యారెంటీ హిట్ అనే ఫీల్ ఉంటుంది. ఇప్పుడు ఇంతమంది స్టార్స్ నటిస్తున్న సినిమా కావడంతో, ఈ సినిమా కూడా గ్యారెంటీ హిట్ అని వారు ఫిక్స్ అయిపోయారు. ఇక తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ అయితే ఇచ్చారు మేకర్స్. బాలీవుడ్‌లో వైవిధ్యమైన పాత్రలు చేస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న నటుడు జిమ్ సర్బ్ పుట్టినరోజు సందర్భంగా, ఆయనకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. నోట్ల కట్ట మధ్య ఆయన స్టైల్‌గా నిల్చున్న ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఇక ఈ సినిమాకు రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. పాన్ ఇండియా చిత్రంగా ‘కుబేర’ భారీ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.

Exit mobile version