సమీక్ష : జోడి – దశా దిశా లేని ఫ్యామిలీ డ్రామా

సమీక్ష : జోడి – దశా దిశా లేని ఫ్యామిలీ డ్రామా

Published on Sep 7, 2019 3:03 AM IST
Jodi movie review

విడుదల తేదీ : సెప్టెంబరు 06, 2019

123తెలుగు.కామ్ రేటింగ్ :  2.25/5

నటీనటులు : ఆది సాయి కుమార్, శ్రద్దా శ్రీనాధ్, వెన్నెల కిషోర్, గొల్లపూడి మారుతీ రావు, సత్య.

దర్శకత్వం : విశ్వనాధ్ అరిగెల

నిర్మాత‌లు : సాయి వెంకటేష్ గుర్రం, పద్మజ

సంగీతం : ఫణి కళ్యాణ్

సినిమాటోగ్రఫర్ : విశ్వేశ్వర్ ఎస్వీ

యంగ్ హీరో ఆది సాయి కుమార్, శ్రద్దా శ్రీనాధ్ జంటగా తెరకెక్కిన రొమాంటిక్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ జోడి. విశ్వనాధ్ అరిగెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నేడు విడుదలైంది. మరి జోడి చిత్రం ఎలాఉందో సమీక్షలో చూద్దాం.

 

కథ:

 

కపిల్(ఆది) యంగ్ సాఫ్ట్వేర్. మొదటి చూపులోనే కాంచన మాల( శ్రద్దా శ్రీనాధ్) ప్రేమలో పడటం, ఆమె ప్రేమను దక్కించుకోవడం జరుగుతుంది. అంతా సవ్యంగా జరుగుతున్న తరుణంలో కపిల్ తండ్రిని చూసిన కాంచన మాల తండ్రి వీరి పెళ్ళికి అడ్డు చెవుతాడు. మొదట కపిల్ తో తన కూతురి వివాహానికి అంగీకరించిన కాంచన తండ్రి, కపిల్ తండ్రి నరేష్ ని చూశాక సంబంధం ఎందుకు క్యాన్సిల్ చేశాడు? వారిద్దరి మధ్య ఉన్న గొడవేంటి? కాంచన మాల తండ్రిని ఒప్పించి కపిల్ ఆమె ను ఎలా దక్కించుకున్నాడు? అనేది మిగతా కథ.

 

ప్లస్ పాయింట్స్:

 

జోడి సినిమాలో హీరోయిన్ గా చేసిన శ్రద్దా శ్రీనాధ్ అందంతో అలాగే నటనతో ఆకట్టుకుంటుంది. ఆమె జోడి చిత్రంలో చాలా అందంగా కనిపించారు. ముఖ్యంగా పాటలలో శ్రద్దా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు. ఆమె తన పాత్రను చక్కగా చేశారు.

ఇక హీరో ఆది తన గత చిత్రాలతో పోల్చుకుంటే ఆయన నటనలో పరిపక్వత కనిపిస్తుంది. తనకు ఇచ్చిన పాత్ర పరిధిలో ఆది నటన ఆకట్టుకుంటుంది. శ్రద్దా ,ఆది మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలలో ఆది అలరించారు. ఇక సీనియర్ నటులు గొల్లపూడి మారుతి రావు కీలక పాత్రలో తన మార్కు నటనతో అలరించారు.

క్రికెట్ బెట్టింగ్ వ్యసనపరుడిగా నరేష్ బాగా చేశారు. విలన్ రోల్ చేసిన ప్రదీప్ తన పాత్ర పరిధిలో పర్వాలేదనిపించారు. వెన్నెల కిషోర్, సత్య ల మధ్య వచ్చే కొన్ని హాస్య సన్నివేశాలు అలరిస్తాయి. రొమాన్స్ మరియు భావోద్వేగ సన్నివేశాలతో మొదటిసగం కొంచెం ఆసక్తిగా సాగుతుంది.

 

మైనస్ పాయింట్స్:

 

ఈచిత్రం యొక్క ప్రధాన బలహీనత కథ అని చెప్పాలి. కొత్తదనం లేని కథలో వచ్చే సన్నివేశాలు ముందుగానే ప్రేక్షకుడికి తెలిసిపోతుంటాయి. దీనితో ఓ కొత్త చిత్రం చూస్తున్నామన్న భావన ఏమాత్రం కలగదు.కథలో బలం లేకపోయినా దర్శకుడు మొదటి సగం మూవీ కొంచెం హాస్యం, రొమాన్స్ , ఎమోషన్స్ తో ఆసక్తికరంగా నడిపించగలిగాడు కానీ, రెండవ భాగంలో పూర్తిగా నిరాశ పరిచాడు.

రెండవ భాగంలో దర్శకత్వ ప్రతిభ కనిపించదు. కథలో ఇరికించినట్టుండే ఎమోషన్స్, కామెడీ చాలా సిల్లీగా అనిపిస్తాయి. చాలా సన్నివేశాలు ఒకేలా అనిపిస్తూ,మళ్ళీ మళ్ళీ చూస్తున్న భావన కలుగుతుంది. ఇక విలనిజం కూడా ఈ చిత్రంలో సరిగా పేలలేదు. క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశం అయితే ప్రేక్షకుడికి పెద్ద నిరాశ కలిగిస్తుంది. ఎందుకంటే అలాంటి ముగింపు గతంలో అనేక చిత్రాలలో చూశాం.

 

సాంకేతిక విభాగం:

 

మూవీ నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. మంచి కెమెరా పనితనం మూవీ సన్నివేశాలకు కళ చేకూర్చింది.జోడి చిత్రంలో కెమెరా వర్క్ మాత్రం ఆకట్టుకుంటుంది. ఇక ఫణి అందించిన పాటలు, బీజీఎమ్ పర్వాలేదు అన్నట్లుగా ఉన్నాయి. ఎడిటింగ్ తీవ్రంగా నిరాశపరిచింది. ఒక 10 నిమిషాల వరకు నిడివి తగ్గిస్తే బాగుండు అనే భావన కలిగింది. పాటలలో లిరిక్స్ పర్వాలేదు, కానీ డైలాగ్స్ చాలా బాగున్నాయి.

ఇక దర్శకుడు విశ్వనాధ్ గురించి చెప్పాలంటే ఆయన ఓ పాత కథను ఎంచుకొని దానికి కమర్షియల్ అంశాలతో మెరుగులుదిద్ది ఆకట్టుకోవడానికి ప్రయిత్నించారు. మొదటి సగం మూవీని ఆహ్లాదంగా నడిపించిన ఆయన రెండవ భాగంతో పూర్తిగా నిరాశపరిచాడు. కథలో భావోద్వేగాలు పలికించడంలో పూర్తిగా విఫలం చెందారు. కథను అటు తిప్పి ఎటు తిప్పి చివరకు రుచిలేని కిచిడి చేశారు.

 

తీర్పు:

 

మొత్తంగా చెప్పాలంటే జోడి చిత్రం ఏమాత్రం ఆకట్టుకొని ఒక రొటీన్ ఫ్యామిలీ డ్రామా. జోడి చిత్రం ఆది కి మరో ఫెయిల్యూర్ మూవీగా మిగిలిపోతుందనిపిస్తుంది. మొదటి సగం కొంచెం కామెడీ, రొమాన్స్, ఎమోషన్స్ తో ఆహ్లదంగా నడిచినా,రెండవ సగం ప్రేక్షకుడిని పూర్తి నిరాశలో నెట్టివేస్తుంది. ఈ చిత్రాన్ని ఎవరైనా కాపాడగలరు అని అంటే అది శ్రద్దా శ్రీనాద్ మాత్రమే. ఈవారం జోడి జోలికి వెళ్ళకుంటేనే మంచింది.

123telugu.com Rating :  2.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు