సినిమా ప్లాప్ పై హీరో కామెంట్స్ వైరల్

సినిమా ప్లాప్ పై హీరో కామెంట్స్ వైరల్

Published on Aug 25, 2024 9:45 PM IST

బాలీవుడ్‌ నటుడు జాన్‌ అబ్రహం సోలో హిట్ కోసం చాలా కాలంగా ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో జాన్‌ అబ్రహం ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘వేదా’ ఆగస్టు 15న విడుదలైంది. కానీ, ఈ చిత్రం బాక్సాఫీస్‌ దగ్గర ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. పైగా, ఈ సినిమాకి కనీస స్థాయిలో కూడా కలెక్షన్స్‌ రాలేదు. ఈ నేపథ్యంలో తన ‘వేదా’ సినిమా బాక్సాఫీస్‌ కలెక్షన్స్‌ గురించి జాన్ అబ్రహం కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇంతకీ, జాన్‌ అబ్రహం ఏం మాట్లాడారు అంటే.. ‘వేదా సినిమా గొప్ప సందేశంతో తెరకెక్కింది. ఇలాంటి చిత్రాల్లో యాక్ట్‌ చేయాలంటే ధైర్యం ఉండాలి. ఈ సినిమా హిట్‌ లేదా ఫ్లాప్‌ అనే విషయాన్ని పక్కన పెడితే.. మాది మాత్రం మంచి చిత్రం. మహిళల సంరక్షణ వంటి సీరియస్‌ అంశాన్ని ప్రేక్షకులను అలరించే విధంగా ఈ చిత్రంలో మేం చూపించాం’ అంటూ జాన్‌ అబ్రహం చెప్పుకొచ్చాడు. అయితే, జాన్‌ అబ్రహం కామెంట్స్ పై నెటిజన్లు విరుచుకు పడుతున్నారు. నువ్వొక అసలు హీరో కాదు, జీరో అంటూ పోస్ట్ లు పెడుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు