ఈ బాలీవుడ్ చిత్రాన్ని ఇంగ్లీష్ లో రీమేక్ చేయనున్న జాన్ విక్ దర్శకుడు!

ఈ శుక్రవారం, బాలీవుడ్ యాక్షన్ మూవీ కిల్ థియేటర్లలోకి రానుంది. కరణ్ జోహార్, గునీత్ మోంగా, అపూర్వ మెహతా మరియు అచిన్ జైన్ నిర్మించిన ఈ చిత్రంలో లక్ష్య, రాఘవ్ జుయల్ మరియు ఆశిష్ విద్యార్థి ప్రధాన పాత్రల్లో నటించారు. నిఖిల్ నగేష్ భట్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. జాన్ విక్ దర్శకుడు చాడ్ స్టాహెల్‌స్కీ తన బ్యానర్ 87ఎలెవెన్ ఎంటర్టైన్మెంట్‌ పై లయన్స్‌గేట్‌తో కలిసి హాలీవుడ్‌లో కిల్‌ను రీమేక్ చేయబోతున్నట్లు ప్రకటించారు.

కిల్ చిత్ర యూనిట్ కి ఇది గొప్ప విజయం అని చెప్పాలి. ఎందుకంటే చాడ్ స్టాహెల్స్కీ కిల్ చిత్ర యూనిట్ యొక్క వర్క్ పట్ల ఆసక్తి కనబరిచారు. ఈ చిత్రాన్ని ఇంగ్లీష్ లోకి రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇంగ్లీషు రీమేక్‌కి సంబంధించిన నటీనటులు మరియు ప్రొడక్షన్‌కు సంబంధించిన వివరాలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. ఈ విషయం బాలీవుడ్ మరియు భారతీయ సినిమా చరిత్రలో అపూర్వమైనది అని చెప్పాలి. ఈ శుక్రవారం విడుదలైన కిల్ భారతీయ బాక్సాఫీస్ వద్ద ఎలా రాణిస్తుందో చూడాలి. అదే విధంగా నార్త్ అమెరికాలో కూడా ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుంది అనేది ఆసక్తి గా మారింది.

Exit mobile version