ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు ప్రపంచ వ్యాప్తంగా కూడా మన తెలుగు సినిమా ప్రైడ్ గా మారు మోగుతుంది. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ హీరోగా మరో సినిమా ఇంకా స్టార్ట్ కాలేదు కానీ తాను నటించిన “రౌద్రం రణం రుధిరం” చిత్రంతో మాత్రం సెన్సేషన్ గా మారింది.
అయితే గత వారమే ఎన్టీఆర్ పేరు ఆస్కార్స్ లో ఓ రేంజ్ లో వినిపించగా ఇపుడు దేశ కేంద్ర మంత్రి బీజేపీ ప్రధాన నాయకులు అమిత్ షా ఎన్టీఆర్ తో డిన్నర్ కి ఆహ్వానం పంపినట్టుగా ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ గా తెలుస్తుంది.
ఎన్టీఆర్ నటించిన RRR సినిమా చూసి అమిత్ షా పర్సనల్ గా ఎన్టీఆర్ ని ఈరోజు డిన్నర్ కోసం ఆహ్వానించగా తారక్ కూడా వెళ్తున్నట్టు కన్ఫర్మ్ అయ్యింది. దీనితో అయితే ఈ ఊహించని అప్డేట్ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.