“వార్ 2” లో మ్యాడ్ సీక్వెన్స్ పూర్తి చేసిన తారక్, హృతిక్!?

ప్రస్తుతం మన ఇండియన్ సినిమా నుంచి రానున్న పలు క్రేజీ మల్టీ స్టారర్ చిత్రాల్లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అలాగే బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ ల కలయికలో దర్శకుడు అయామ్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “వార్ 2” కూడా ఒకటి. మరి బాలీవుడ్ స్పై యూనివర్స్ యష్ రాజ్ ఫిల్మ్స్ వారి స్పై యూనివర్స్ లో భాగంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆల్రెడీ ఎన్టీఆర్ కొన్ని రోజులు షూటింగ్ లో పాల్గొన్నాడు.

అయితే ఎన్టీఆర్ పాల్గొన్న కొన్ని రోజుల్లో కూడా దర్శకుడు అయాన్ సాలిడ్ యాక్షన్ సీక్వెన్స్ లని కంప్లీట్ చేసినట్టుగా తెలుస్తుంది. హృతిక్ అలాగే తారక్ లపై ఒక వాటర్ జెట్స్కి సీక్వెన్స్ ని తెరకెక్కించారట. ఇది సినిమాలో మామూలు లెవెల్లో ఉండదని యాక్షన్ మూవీ లవర్స్ కి అయితే మ్యాడ్ ఫీస్ట్ ని ఈ సీన్ అందిస్తుంది అని తెలుస్తుంది. మొత్తానికి అయితే ఈ సినిమాపై ఉన్న అంచనాలకి తగ్గట్టుగానే ఓ రేంజ్ లో అన్నీ ప్లాన్ చేస్తున్నారని చెప్పాలి.

Exit mobile version