నవ ఎన్టీఆర్ కి తారక్, కళ్యాణ్ రామ్ ల బెస్ట్ విషెస్

నవ ఎన్టీఆర్ కి తారక్, కళ్యాణ్ రామ్ ల బెస్ట్ విషెస్

Published on Oct 30, 2024 2:01 PM IST

మన తెలుగు సినిమా దగ్గర నందమూరి తారక రామారావు అనే పేరుకి ప్రత్యేక స్థానమే ఉంటుంది అని చెప్పాలి. దివంగత నటుడు స్వర్గీయ సీనియర్ ఎన్టీఆర్ వారసత్వంలో తన పేరిట వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ప్రపంచ స్థాయిలో సంచలనంగా మారాడు. అయితే ఇపుడు ఇదే నందమూరి కుటుంబం నుంచి వచ్చిన నాలుగో తరం యువ నటుడే నందమూరి తారక రామారావు.

మరి దివంగత హరికృష్ణ గారి తనయుడు దివంగత జానకిరామ్ వారసుడిగా వచ్చిన ఈ నవ ఎన్టీఆర్ కి తన సోదరులు జూనియర్ ఎన్టీఆర్ అలాగే కళ్యాణ్ రామ్ లు తమ బెస్ట్ విషెస్ ని అందించి నువ్వు ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నట్లుగా ఇద్దరు సోదరులు తమ ఆశీస్సులు అయితే అందించారు. ఇక ఈ యంగ్ ఎన్టీఆర్ ని దర్శకుడు వై వి ఎస్ చౌదరి పరిచయం చేస్తుండగా తనపై సాలిడ్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ కూడా వచ్చాయి. మరి ఈ యువ హీరో డెబ్యూ ఏ లెవెల్లో ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు