వైరల్ : చిన్న వెకేషన్ ముగించుకొని వచ్చిన తారక్.!

వైరల్ : చిన్న వెకేషన్ ముగించుకొని వచ్చిన తారక్.!

Published on Jun 4, 2023 7:06 AM IST

NTR 5

ప్రస్తుతం మన టాలీవుడ్ గ్లోబల్ హీరోస్ లో ఒకరైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో భారీ చిత్రం “దేవర” తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా షూట్ శరవేగంగా కంప్లీట్ అవుతుండగా రీసెంట్ గానే తారక్ బర్త్ డే కానుకగా వచ్చిన ఫస్ట్ లుక్ కి సెన్సేషనల్ రెస్పాన్స్ కూడా వచ్చింది. అయితే రీసెంట్ గా తారక్ కి కొన్ని రోజుల పాటు వ్యవధి దొరకడంతో అయితే తన ఫ్యామిలీ తో కలిసి తారక్ చిన్న వెకేషన్ కోసం దుబాయ్ ట్రిప్ వెళ్లారు.

మరి ఈ ట్రిప్ నుంచి అయితే తారక్ నిన్న రాత్రి తిరిగి వచ్చేయగా హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి అయితే తారక్ విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ లో వైరల్ గా మారాయి. ఇక ఇప్పుడు మళ్లీ ఎన్టీఆర్ దేవర షూట్ లో పాల్గొననున్నారు. ఇక ఈ భారీ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు అలాగే ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

తాజా వార్తలు