యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలయికలో రాబోతున్న అత్యంత భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. ఈ జనరేషన్ లో మొదటిసారి టాలీవుడ్ లోని రెండు పెద్ద కుటుంబాలకు చెందిన ఇద్దరు బడా స్టార్స్ ఒకే సినిమాలో కలిసి నటిస్తుండటంతో.. మొదటి నుండి ఈ సినిమా పై ప్రత్యేక అభిమానాన్ని చూపిస్తూ వస్తున్నారు ఫ్యాన్స్. అలాగే ఈ సినిమా కోసం ఇండస్ట్రీ మొత్తం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోంది.
కాగా జనవరి 7న ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ కాబోతుంది. దాంతో ‘ఆర్‌ఆర్‌ఆర్’ ప్రమోషన్స్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. ఆ ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ – చరణ్ ఫుల్ బిజీగా ఉన్నారు. వినూత్నమైన ప్రమోషన్స్ చేస్తూ అందులో భాగంగా ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాకి సంబంధించి విశేషాలు చెబుతూనే.. ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్.. మెగా, నందమూరి మధ్య ఉన్న పోటీ గురించి కామెంట్స్ చేశాడు.
గత 35 ఏళ్లుగా తమ రెండు కుటుంబాల మధ్య పోరు ఉందని, అయితే ఆ పోరు ఎంత ఉన్నా.. (చరణ్ – ఎన్టీఆర్) మేమిద్దరం మంచి స్నేహితులం అని, చరణ్ కు, తనకు మధ్య ఎప్పుడూ ఆరోగ్యకరమైన పోటీ మాత్రమే ఉందని ఎన్టీఆర్ వెల్లడించారు.