ప్రీ సేల్స్ లో “దేవర” సెన్సేషన్.. మరో రికార్డు మైల్ స్టోన్

ప్రీ సేల్స్ లో “దేవర” సెన్సేషన్.. మరో రికార్డు మైల్ స్టోన్

Published on Sep 26, 2024 11:08 AM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తూ దర్శకుడు కొరటాల శివ తీసిన అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం “దేవర” కోసం ఇప్పుడు పాన్ ఇండియా ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ చిత్రం మరికొన్ని గంటల్లో బిగ్ స్క్రీన్స్ పై పడనుండగా యూఎస్ మార్కెట్ లో అయితే 26 సాయంత్రం నుంచే షోస్ పడిపోనున్నాయి.

అయితే ఈ సినిమా యూఎస్ మార్కెట్ లో రికార్డు బుకింగ్స్ ని ప్రీ సేల్స్ లో చేస్తుండగా లేటెస్ట్ గా ఈ సినిమా మరో భారీ మైల్ స్టోన్ ని కేవలం ప్రీ సేల్స్ తోనే అందుకున్నట్టుగా తెలుస్తుంది. దీనితో ఈ చిత్రం ఇపుడు రికార్డు మైల్ స్టోన్ 2.5 మిలియన్ డాలర్స్ మార్క్ ని ఈ చిత్రం అందుకుంది. దీనితో దేవర సెన్సేషన్ ఏ లెవెల్లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించాడు. అలాగే ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు