చరణ్ కి పెద్ద టార్గెట్టే ఇచ్చిన తారక్.. “గేమ్ ఛేంజర్” కొట్టగలదా?


మన టాలీవుడ్ నుంచి వచ్చిన పలు భారీ మల్టీస్టారర్ చిత్రాల్లో ఈ మధ్యలో కాలంలో వచ్చిన బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఏదన్నా ఉంది అంటే అది మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల కలయికలో దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన చిత్రం “రౌద్రం రణం రుధిరం” అనే చెప్పాలి. మరి ఈ సినిమాతో ఇద్దరి హీరోల నడుమ ఉన్న బాండింగ్ ఏంటి అనేది అందరికీ తెలిసింది.

అలాగే గ్లోబల్ వైడ్ గా వారి క్రేజ్ ని కూడా పెంచింది. అయితే ఇక ఈ సినిమా తర్వాత ఇద్దరూ భారీ సినిమాలు సోలోగా చేస్తున్నారు. మరి వీటిలో తారక్ చేస్తున్న “దేవర” చరణ్ “గేమ్ ఛేంజర్” కంటే లేట్ గానే స్టార్ట్ అయినప్పటికీ ముందే విడుదలకి వచ్చేస్తుంది. అయితే ఈ సినిమా ఇప్పుడు టాలీవుడ్ నుంచి వెళ్లిన పాన్ ఇండియా సినిమాల్లో ఫాస్టెస్ట్ ప్రీ సేల్స్ రికార్డుని సాధించింది.

యూఎస్ మార్కెట్ లో 1 మిలియన్ డాలర్స్ మార్క్ ని రిలీజ్ కి ముందే అందుకొని భారీ టార్గెట్ ని ఇతర హీరోలకి సెట్ చేసింది. మరి దీనిని తన కో స్టార్ రామ్ చరణ్ తన “గేమ్ ఛేంజర్” తో క్రాస్ చేస్తాడో లేదో చూడాలి. గేమ్ ఛేంజర్ పై కూడా బజ్ గట్టిగానే ఉంది.. మరి దేవర తర్వాత రాబోతున్న ఈ చిత్రం దానిని క్రాస్ చేస్తుందో లేదో మరికొన్ని నెలలు ఆగి చూడాలి.

Exit mobile version