బుక్ మై షోలో కూడా “దేవర” హవా.. “పుష్ప 2” ని క్రాస్ చేసి

బుక్ మై షోలో కూడా “దేవర” హవా.. “పుష్ప 2” ని క్రాస్ చేసి

Published on Sep 17, 2024 12:12 PM IST

ప్రస్తుతం టాలీవుడ్ నుంచి వస్తున్న అవైటెడ్ పాన్ ఇండియా సినిమా ఏదన్నా ఉంది అంటే అది మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన భారీ చిత్రం “దేవర” అనే చెప్పాలి. మరి ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇపుడు రిలీజ్ దగ్గరకి వస్తుండగా హైప్ కూడా అంతకంతకూ పెరుగుతూ వస్తుంది.

ఇలా యూఎస్ మార్కెట్ లో ఆల్ టైం ఫాస్టెస్ట్ బుకింగ్స్ ని నమోదు చేస్తుండగా ఈ సినిమా ఇపుడు బుక్ మై షోలో కూడా అదరగొడుతుంది. ఇన్ని రోజులు హైయెస్ట్ ఇంట్రెస్ట్స్ ఉన్న టాలీవుడ్ సినిమాగా పుష్ప 2 ఉంటే ఇప్పుడు దేవర దీనిని క్రాస్ చేసి ప్రేక్షకులు అత్యధికంగా ఎదురు చూస్తున్న సినిమాగా నిలిచింది. దీనితో దేవర హవా ఆల్రెడీ ఓ రేంజ్ లో కొనసాగుతుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించారు. అలాగే వరల్డ్ వైడ్ ఈ సినిమా సెప్టెంబర్ 27న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు