“దేవర” ఐమ్యాక్స్ వెర్షన్ రెస్పాన్స్ కూడా తగ్గేదేలే..

“దేవర” ఐమ్యాక్స్ వెర్షన్ రెస్పాన్స్ కూడా తగ్గేదేలే..

Published on Sep 6, 2024 9:02 AM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “దేవర” కోసం అందరికీ తెలిసిందే. బాలీవుడ్ నటులు జాన్వీ కపూర్ అలాగే సైఫ్ అలీఖాన్ లు తెలుగు సినిమాకి పరిచయం అవుతూ వస్తున్నా ఈ చిత్రంపై భారీ హైప్ ప్రస్తుతం నెలకొంది. అయితే ఈ సినిమా యూఎస్ ప్రీ సేల్స్ బుకింగ్స్ మొదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రీ సేల్స్ లో అక్కడ ఊహించని రెస్పాన్స్ ఈ చిత్రానికి వచ్చింది.

ఇక లేటెస్ట్ గా దేవర ఐమ్యాక్స్ వెర్షన్ రిలీజ్ ని కూడా మేకర్స్ కన్ఫర్మ్ దీనితో యూఎస్ మార్కెట్ లో అనౌన్స్ చేసి బుకింగ్ ఓపెన్ చేయగా వీటికి కూడా భారీ బుకింగ్స్ నమోదు చేసుకుంటుంది. ఇలా మొత్తానికి అయితే ఓవర్సీస్ మార్కెట్ లో దేవర ప్రభంజనమే సృష్టించేలా ఉందని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా ఎన్టీఆర్ అరీస్, యువసుధ ఆర్ట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ సెప్టెంబర్ 27న గ్రాండ్ గా సినిమా రిలీజ్ కాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు