“దేవర”.. భయం తాలూకా ముఖాల్ని పరిచయం చేసిన మేకర్స్

“దేవర”.. భయం తాలూకా ముఖాల్ని పరిచయం చేసిన మేకర్స్

Published on Aug 27, 2024 10:27 AM IST


టాలీవుడ్ మాస్ హీరో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా యాక్షన్ చిత్రం “దేవర” కోసం అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ కొరటాల నుంచి రాబోతున్న రెండో సినిమా ఇది కావడం పైగా పాన్ ఇండియా సినిమా కావడంతో అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. మరి మొదటి నుంచి కూడా భయాన్నే భయపెట్టే వాడే మా దేవర అన్నట్టుగా చూపిస్తూ వస్తున్నా మేకర్స్ ఇప్పుడు ఒక పవర్ ఫుల్ పోస్టర్ ని రిలీజ్ చేశారు.

తమ భయం తాలూకా ముఖాలు వీరే అంటూ ఎన్టీఆర్ తాలూకా రెండు డిఫరెంట్ లుక్స్ ని కలిపి ఉన్న పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఇందులో ఒక ముఖం నవ్వుతూ ఒక ముఖం కోపంగా కనిపిస్తున్నాయి. అలాగే దీనితో దేవర రిలీజ్ కి మరొక్క నెల మాత్రమే ఉందని అలర్ట్ చేస్తున్నారు. ఇక నెలలో ఎలాంటి అప్డేట్స్ రానున్నాయి అనేది చూడాలి. ఇక ఈ భారీ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు