“దేవర” ట్రైలర్ బిగ్ స్క్రీన్స్ పై మరో లెవెల్.. డెఫినెట్ గా ఒపీనియన్ మార్చుకుంటారు

“దేవర” ట్రైలర్ బిగ్ స్క్రీన్స్ పై మరో లెవెల్.. డెఫినెట్ గా ఒపీనియన్ మార్చుకుంటారు

Published on Sep 14, 2024 9:01 AM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “దేవర” కోసం అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం మరికొన్ని రోజుల్లో థియేటర్స్ లో రాబోతుంది.

ఇక ఈ భారీ సినిమా నుంచి రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ కి ఊహించని విధంగా ఆడియెన్స్ లో నెగిటివ్ టాక్ ఎక్కువ వచ్చింది. కానీ దేవర ట్రైలర్ ని ఒక్కసారి బిగ్ స్క్రీన్స్ పై చూసిన వారికి మాత్రం ఆ ఒపీనియన్ మారుతుంది అని చెప్పొచ్చు. డెఫినెట్ గా బిగ్ స్క్రీన్స్ పై ఎక్స్ పీరియన్స్ మొబైల్ స్క్రీన్స్ లో రాదు.

అనిరుద్ ఇచ్చిన మ్యూజిక్ కి ఎన్టీఆర్ మాస్ ప్రెజెన్స్ కొరటాల టేకింగ్ ఇవన్నీ బిగ్ స్క్రీన్స్ పై చూసిన వాళ్ళు ఇప్పుడు సర్ప్రైజ్ అవుతున్నారు. మరి మేకర్స్ అప్పుడే ట్రైలర్ రిలీజ్ కి థియేటర్స్ లో కూడా లాంఛ్ చేసి ఉంటే బాగుండేది. మొత్తానికి అయితే దేవర బిగ్ స్క్రీన్స్ పై ట్రీట్ మాత్రం మరో లెవెల్లో ఉందని చూసిన వారితో పాటు మేము కూడా అంటున్నాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు