“దేవర” ట్రైలర్ వచ్చేది ఈ సమయం తర్వాతే..

“దేవర” ట్రైలర్ వచ్చేది ఈ సమయం తర్వాతే..

Published on Sep 8, 2024 7:30 PM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటించిన అవైటెడ్ భారీ చిత్రం “దేవర” పై ఇప్పుడు ఎలాంటి అంచనాలు నెలకొన్నాయో యూఎస్ మార్కెట్ లో నమోదు అవుతున్న రికార్డు బుకింగ్స్ చూస్తేనే అర్ధం అవుతుంది. అలాగే ఇప్పుడు సినిమా నుంచి అవైటెడ్ ట్రైలర్ కోసం కూడా అభిమానులు ఎంతో ఉత్సుకతతో ఎదురు చూస్తుండగా దీనిని ఈ సెప్టెంబర్ 10న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేసేసారు.

అయితే ఈ ట్రైలర్ కి లాంఛ్ ఈవెంట్ ని ముంబై లో ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. మరి అక్కడ ఈ ఈవెంట్ మధ్యాహ్నం 3 గంటలకి మొదలు కానుందట. సో ఈ 10న మధ్యాహ్నం 3 తర్వాతే దేవర ట్రైలర్ ఆన్లైన్ లో అందుబాటులో ఉంటుంది అని చెప్పాలి. మరి ఆ టైం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తూ కొత్త రికార్డులు సెట్ చెయ్యాలని చూస్తున్నారు. మరి దేవర ట్రైలర్ ఎలాంటి సెన్సేషన్ ని నమోదు చేస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు