షాకింగ్ : నిర్మాత మహేష్ కోనేరు ఇక లేరు..తారక్ భావోద్వేగ స్పందన

Published on Oct 12, 2021 9:09 pm IST

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఇప్పుడు మరో తీరని తీవ్ర విషాదం నెలకొంది.. తెలుగు సినిమా ప్రముఖ నిర్మాత మహేష్ కోనేరు ఈరోజు ఉదయం మరణించారన్న వార్త బయటకి రావడంతో టాలీవుడ్ దిగ్బ్రాంతికి లోనయ్యింది. ఈరోజు ఉదయం విశాఖపట్నంలో మహేష్ కోనేరు ఆకస్మిక గుండెపోటు కారణంగా తన తుది శ్వాస విడిచినట్టు తెలిసింది. దీనితో ఈ కలచివేసిన వార్తతో టాలీవుడ్ పెద్దలు ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

అయితే మహేష్ కోనేరుకి జూనియర్ ఎన్టీఆర్ ఎంత ఆప్తులో తెలిసిందే. వారి మధ్య మంచి స్నేహబంధం ఉంది. మరి ఈ ఆకస్మిక హృదయ విదారక వార్త వినడంతో తారక్ మరింత భావోద్వేగానికి లోనయ్యారు. నా స్నేహితుడు ఇక లేడు అనే వార్త చాలా షాక్ గురి చేసి మాట కూడా రానీకుండా చేస్తుంది అని తారక్ తన భావోద్వేగాన్ని వ్యక్తం చేశారు.

అలానే వారి కుటుంబానికి తన ప్రఘాడ సానుభూతిని వ్యక్తం చేస్తున్నానని కోనేరు మరణం పట్ల నివాళులు అర్పించారు. మహేష్ కోనేరు అకాల మరణం టాలీవుడ్ కి నిజంగా తీరని లోటు తన బ్యానర్ నుంచి ఎన్నో బెస్ట్ క్వాలిటీ సినిమాలను టాలీవుడ్ ఆడియెన్స్ కి అందించిన వారి పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని మా 123తెలుగు యూనిట్ ఆకాంక్షిస్తుంది. ఓం శాంతి.

సంబంధిత సమాచారం :

More