మన తెలుగు రాష్ట్రాల్లో స్టార్ హీరోస్ ని కొలిచినట్టుగా మరెక్కడా కూడా ఓ హీరోలని ఆరాధ్య దైవంలా భావిస్తారు. మరి అలాంటి కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోస్ లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కూడా ఒకరు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ క్రేజ్ భారీ లెవెల్లో ఉంటుంది. ఆన్లైన్ అయినా కానీ ఆఫ్ లైన్ అయినా కానీ ఎన్టీఆర్ కి మాస్ ఫాలోయింగ్ ఉంది.
ఇలా ఉన్న వీరాభిమానుల్లో ఒక అభిమాని ఆఖరి కోరిక ఇప్పుడు ఇతర అభిమానులని కదిలిస్తుంది. తిరుపతికి చెందిన కౌశిక్ అనే 19 ఏళ్ల కుర్రాడు బ్లడ్ క్యాన్సర్ బారిన పడడంతో తన వైద్యానికి 60 లక్షలకి పైగా ఖర్చు అవుతుంది అని డాక్టర్లు చెప్పారట. కానీ వారి కుటుంబీకులకు అంత స్థోమత లేదు.
అయితే కౌశిక్ ఇక తాను బతకనని అర్ధం అయ్యింది అని కానీ తన చివరి కోరికగా “దేవర” సినిమా చూడాలని ఉంది అని ఈ 27 వరకు నన్ను బతికిస్తే చాలు అతడు కోరుకుంటున్నాడు. దీనితో ఈ వార్త ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో ఎమోషనల్ గా మారింది. మరి ఈ విషయాన్ని తారక్ వరకు తీసుకెళ్లే విధంగా ఫ్యాన్స్ పూనుకున్నారు. మరి కౌశిక్ విషయంలో ఏమన్నా అద్భుతం జరుగుతుందో లేదో చూడాలి.