మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన భారీ హిట్ చిత్రం “దేవర” కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రం మన దగ్గర సూపర్ రన్ తర్వాత ఇపుడు జపాన్ దేశంలో కూడా రిలీజ్ కి సిద్ధం అయ్యింది. మరి అక్కడ ప్రమోషన్స్ కోసం స్వయంగా ఎన్టీఆర్ వెళ్లి మరీ అక్కడి ఫ్యాన్స్ తో ముచ్చటిస్తూ మంచి ఎనర్జిటిక్ గా ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు. అయితే ఇదే ఇపుడు తారక్ అభిమానులని డిజప్పాయింట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
ఎన్టీఆర్ ఇపుడు జపాన్ లో చేస్తున్న రేంజ్ ప్రమోషన్స్ మన తెలుగు రాష్ట్రాల్లో బాగా మిస్ అయ్యాయి అని చెప్పాలి. తనని ప్రేమించే అభిమానులకి సినిమా రిలీజ్ ముందు సరైన ప్రమోషన్స్ ఈవెంట్స్ లాంటివి లేకుండానే మేకర్స్ కానిచ్చేశారు. దీనితో అప్పుడు తీవ్ర నిరాశకి లోనైన ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇపుడు జపాన్ లో ప్రమోషన్స్ చూసి మళ్ళీ నిరాశ చెందుతున్నారు. మన దగ్గర కూడా తమ హీరో ఇలా చేయాల్సింది అని భావిస్తున్నారు. ఇక తారక్ ఫుల్ స్వింగ్ లో జపాన్ ప్రమోషన్స్ చేస్తుండగా అక్కడ ఈ మార్చ్ 27న సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.