ఎన్టీఆర్ ఫ్యాన్స్ మెంటల్ మాస్ ప్రమోషన్స్.. ఏకంగా సొర చేపలతోనే “దేవర” కోసం

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తనకి ప్రపంచ వ్యాప్తంగా అభిమాన జనం ఉన్నారు. అయితే తనకి ఉన్న కల్ట్ అభిమానులు మన టాలీవుడ్ లో డిఫరెంట్ లెవెల్ ఫ్యానిజాన్ని చూపిస్తారు అని చెప్పాలి.

అలా గతంలో RRR సినిమాకి కూడా ఏకంగా విమానాలతో ప్రమోషన్స్ చేయగా ఈ సారి తారక్ నుంచి వస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “దేవర” నీటి నేపథ్యంలో తెరక్కడం పైగా ఈ సినిమాలో సొర చేపపై సన్నివేశాలు ఉండడంతో తారక్ అభిమానులు ఏకంగా నీటి లోపల అది కూడా సొర చేపల నడుమ దేవర పోస్టర్స్ వేసి మెంటల్ మాస్ ఫ్యానిజాన్ని చూపించి తమకి తామే సాటి అనిపించుకున్నారు.

దీనితో ఈ విజువల్స్ చూసిన ఇతర హీరోల అభిమానులు సైతం షాకవుతున్నారు. మొత్తానికి అయితే ఇలా తారక్ ఫ్యాన్స్ మాత్రం దేవర విషయంలో అదరగొట్టేసారు అని చెప్పాలి. ఇక ఈ భారీ చిత్రానికి దర్శకుడు కొరటాల శివ వర్క్ చేయగా అనిరుద్ సంగీతం అందించాడు. అలాగే ఈ సెప్టెంబర్ 7న సినిమా గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది.

Exit mobile version