వెట్రిమారన్ తో సినిమా వద్దు.. తారక్ ఫ్యాన్స్ ట్విస్ట్

వెట్రిమారన్ తో సినిమా వద్దు.. తారక్ ఫ్యాన్స్ ట్విస్ట్

Published on Jan 28, 2025 12:31 PM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఎలాంటి పొటెన్షియల్ ఉన్న నటుడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఇలాంటి స్టార్ తో ఏ దర్శకుడు అయినా వర్క్ చెయ్యాలి అని అనుకుంటారు. ఇక ఒక సరైన నటుడు తగిల్తే సాలిడ్ సినిమాలు అందించే దర్శకుడు.. ఇలాంటి కాంబినేషన్ పడితే మూవీ లవర్స్ కి అలాగే వారి అభిమానులకి కూడా మంచి ట్రీట్ ఉంటుంది.

అలాంటి ఓ కాంబినేషన్ నే ఎన్టీఆర్ అలాగే దర్శకుడు వెట్రిమారన్ ల కలయిక అని చెప్పవచ్చు. అయితే ఈ క్రేజీ కాంబినేషన్ లో ఒక సినిమా కావాలని కోరుకున్న తారక్ అభిమానులు ఇపుడు తమకి ఈ దర్శకునితో సినిమా వద్దని చెప్తున్నారు. దీనికి కారణం వెట్రిమారన్ నుంచి లేటెస్ట్ గా వచ్చిన “బ్యాడ్ గర్ల్” టీజర్.

ఈ టీజర్ ఇపుడు ఊహించని కాంట్రవర్సీలు రేపుతున్న నేపథ్యంలో వెట్రిమారన్ ఇలాంటి సినిమాలు నిర్మిస్తూ తన మర్యాద పోగొట్టుకుంటున్నారు అని తనపై చాలా నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి. దీనితో సోషల్ మీడియాలో చాలా మంది తారక్ ఫ్యాన్స్ వెట్రిమారన్ తో సినిమా వద్దని చెప్పేస్తున్నారు. ఒకవేళ ప్లాన్స్ ఉన్నా కూడా ఆపేయాలని సూచిస్తున్నారు. ఇది మాత్రం వీరి నుంచి ఊహించని ట్విస్ట్ అనే చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు