‘దేవర’ సందడి కోసం ఎన్టీఆర్ ‘జపాన్’కు !

‘దేవర’ సందడి కోసం ఎన్టీఆర్ ‘జపాన్’కు !

Published on Mar 23, 2025 2:00 PM IST

జపాన్ లో కూడా ‘దేవర: పార్ట్ 1’ సందడి చేయబోతుంది. ఈ క్రమంలో జపాన్ లో తన సినిమా ప్రమోషన్ కోసం జూనియర్ ఎన్టీఆర్ జపాన్‌ కు వెళ్లారు. మార్చి 28న రెగ్యులర్ మరియు ఐమాక్స్ ఫార్మాట్‌లలో ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తన భార్య ప్రణీతతో కలిసి ఎన్టీఆర్ ఈ ఉదయం బెంగళూరు విమానాశ్రయంలో జపాన్‌కు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడి అభిమానులతో కలిసి సినిమాని చూడబోతున్నారు. మొత్తానికి ఈ పర్యటనలో ఎన్టీఆర్ స్పీచ్ లు, అక్కడి ప్రేక్షకులతో గడిపే ఎన్టీఆర్ ప్రత్యేక క్షణాల కోసం ఇక్కడి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఏది ఏమైనా ఇండియన్ సినిమా గ్లోబలైజ్ అయిపోయింది. వరల్డ్ వైడ్ గా ఇండియన్ సినిమాకి ఫ్యాన్స్ పెరిగిపోవడంతో పాటు కోట్లు కాసులు కురిపించే విధంగా మార్కెట్ భారీ స్థాయిలో బిల్డ్ అయిపోయింది. అలాగే, ఓవర్సీస్ మార్కెట్ కూడా ఇండియన్ సినిమాకి పెద్ద బలంగా మారింది. ముఖ్యంగా అమెరికా జపాన్ రష్యాలో కొత్త మార్కెట్ ఓపెన్ అయ్యి ఓవర్సీస్ కలెక్షన్లలో మేజర్ రోల్ ప్లే చేస్తున్నాయి. అందుకే, మన హీరోలు కూడా ఓవర్సీస్ అండ్ జపాన్ మార్కెట్ మీద కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే దేవర పార్ట్ 1 జపాన్ లో రిలీజ్ కాబోతుంది.

కాగా ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో షైన్ టామ్ చాకో, ప్రకాష్ రాజ్ లతో పాటు శ్రీకాంత్ తదితరులు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు