నందమూరి తారక రత్న ఆకస్మికంగా గుండెపోటుకు లోనయ్యి బెంగళూరు హృదయాలయ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే. దీనితో ఈరోజు వారి కుటుంబీకులు యంగ్ టైగర్ ఎన్టీఆర్ సహా కళ్యాణ్ రామ్ మరియు నందమూరి బాలకృష్ణ లు ఈరోజు ఉదయాన్నే బెంగళూరికి చేరుకున్నారు.
దీనితో తారకరత్న ఆరోగ్యం విషయంలో వైద్యులతో మాట్లాడి తారకరత్న ని చూసి వచ్చారు. మరి ఈ అనంతరం తారక్ అయితే మీడియాతో మాట్లాడి తన సోదరుడు ఆరోగ్యం పట్ల కీలక కామెంట్స్ చేశారు. ప్రస్తుతం అన్న కి మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నామని తాను ట్రీట్మెంట్ కి స్పందిస్తున్నారని ఇది నిజంగా మంచి సంకేతం అని తాను వెల్లడించారు.
అయితే డాక్టర్ లు అన్న స్టేబుల్ గా ఉన్నారని చెప్పారని అలాగని మరీ క్రిటికల్ గా లేరు అని చెప్పలేదని ప్రస్తుతం అయితే అందరి ఆశీస్సులతో మళ్ళీ అన్న మన అందరిలో కలిసి ఉండాలని కోరుకుందాం అని తాను తెలిపారు. మొత్తానికి అయితే తారకరత్న ఆరోగ్యంపై ఎన్టీఆర్ నోటి నుంచి ఓ శుభదాయక వార్త వచ్చింది అని చెప్పాలి.