‘జాన్వీ కపూర్’తో ఎన్టీఆర్ ప్రత్యేక ఇంటర్వ్యూలు

‘జాన్వీ కపూర్’తో ఎన్టీఆర్ ప్రత్యేక ఇంటర్వ్యూలు

Published on Sep 8, 2024 6:03 PM IST

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్-ఇండియన్ యాక్షన్ డ్రామా దేవర: పార్ట్ 1 కోసం జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 27న గ్రాండ్ గా థియేట్రికల్ విడుదలకు ఈ సినిమా రెడీగా ఉంది. ఐతే, ప్రస్తుతం ఎన్టీఆర్, దేవర సినిమా ప్రమోషన్ల కోసం ఈ రోజు ముంబైకి వెళ్ళాడు. జాన్వీ కపూర్ తో కలిసి ఎన్టీఆర్ కొన్ని ప్రత్యేక ఇంటర్వ్యూలను ఇవ్వనున్నాడు.

ముంబై నుంచి వచ్చిన అనంతరం అటు తమిళ ఇటు తెలుగులో ‘దేవర’ టీమ్ కొన్ని స్పెషల్ ఈవెంట్స్ ను, ఇంటర్వ్యూస్ ను ప్లాన్ చేస్తున్నారట. మొత్తానికి దేవర సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో షైన్ టామ్ చాకో, ప్రకాష్ రాజ్ లతో పాటు శ్రీకాంత్ తదితరులు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మరి పాన్‌ ఇండియా రేంజ్‌ లో ఈ సినిమా ఏ రేంజ్ వసూళ్లు సాధిస్తోందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు