జూ.ఎన్టీఆర్‌కి గాయం.. అయినా ఆగని ‘దేవర’ షూటింగ్!

జూ.ఎన్టీఆర్‌కి గాయం.. అయినా ఆగని ‘దేవర’ షూటింగ్!

Published on Aug 14, 2024 3:15 PM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ.ఎన్టీఆర్ రీసెంట్‌గా దేవర షూటింగ్‌లో తన పాత్రకు సంబంధించిన షూటింగ్ ముగించుకున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఎన్టీఆర్‌కి చిన్న గాయమైనట్లుగా నేడు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఎన్టీఆర్ టీమ్ దీనికి సంబంధించి ఓ ప్రకటన విడుదల చేసింది.

ఎన్టీఆర్‌కి స్వల్ప గాయం అయిన మాట వాస్తవం అని వారు తెలిపారు. జిమ్‌లో వర్కౌట్ చేస్తుండగా ఆయన ఎడమ చేయి మణికట్టు దగ్గర చిన్న గాయం అయినట్లుగా తెలిపారు. దీంతో ఆయన చేతికి డాక్టర్లు కట్టు వేశారని.. గాయం ఉన్నప్పటికీ తారక్ నిన్న రాత్రి దేవర షూటింగ్ ముగించుకున్నారని ఆయన టీమ్ తెలిపింది. ఆయన ప్రస్తుతం కోలుకుంటున్నారని.. త్వరలోనే తిరిగి తన వర్క్ మొదలుపెడతారని వారు తెలిపారు.

జూ.ఎన్టీఆర్‌కి గాయమైందనే వార్తతో అభిమానులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అయితే, గాయం చిన్నదేనని తెలియడంతో వారు ఊపిరిపీల్చుకున్నారు. ఇక ‘దేవర’ షూటింగ్ ముగించుకున్న తారక్, త్వరలోనే ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్‌ను మొదలుపెట్టడంతో పాటు.. వార్-2 షూటింగ్‌లోనూ జాయిన్ కానున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు