Jr NTR: పొలిటికల్ ప్రశ్నపై తారక్ ఆన్సర్ వైరల్

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ భారీ చిత్రం “దేవర” (Devara) సెన్సేషన్ వరల్డ్ వైడ్ ఎలా కొనసాగుతుందో చూస్తున్నాం. తారక్ నుంచి చాలా కాలం తర్వాత సోలోగా వచ్చిన చిత్రం అది కూడా తన నుంచి మొదటి పాన్ ఇండియా సినిమా కూడా ఇదే కావడంతో అంచనాలు ఆకాశంలో నిలిచాయి.

మరి ఈ సినిమా రిలీజ్ కి ముందు తారక్ ఇండియా వైడ్ గా ప్రమోషన్స్ లో పాల్గొన్నాడు. అలా బాలీవుడ్ ఫేమస్ టాక్ షో కపిల్ శర్మ షోలో కూడా తారక్ పాల్గొన్నాడు. అయితే ఇందులో తనకి పొలిటికల్ రిలేటడ్ గా ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. తన అభిమానులని ఓటర్స్ గా మార్చుకునే అవకాశం ఏమన్నా ఉందా అంటే దానికి తారక్ ఇచ్చిన సమాధానం వైరల్ గా మారింది.

తాను తన ఫ్యాన్స్ తన కోసం టికెట్స్ కొనుక్కునే వరకు చాలని అంతకు మించి ఇంకేమి వద్దు నేను ప్రస్తుతానికి ఇంతవరకు సంతోషం గానే ఉన్నాను. బహుశా నేను ఓ తెలివైన నిర్ణయాన్నే తీసుకున్నాను అనుకుంటున్నాను అని తారక్ సాలిడ్ ఆన్సర్ అందించాడు. దీనితో ఫ్యాన్స్ లో ఈ సమాధానం వైరల్ గా మారింది.

Exit mobile version