మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన భారీ హిట్ చిత్రం “దేవర” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా మన దగ్గర భారీ హిట్ అయ్యి ఇపుడు జపాన్ ఆడియెన్స్ ని అలరించేందుకు వెళుతుంది. కొన్ని రోజులు కితమే అక్కడ వేసిన ప్రీమియర్స్ కి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది.
ఇక ఇపుడు సమయం దగ్గరకి కూడా వస్తుండగా లేటెస్ట్ గా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జపాన్ లో ఎన్టీఆర్ కి మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇపుడు తన లేడీ ఫాలోయింగ్ వైరల్ గా మారింది. ఎన్టీఆర్ కటౌట్ పెట్టి దానికి పూజ చేసేస్తున్నారు కొంతమంది జపాన్ అమ్మాయిలు. దీనితో ఈ క్రేజీ వీడియో ఎన్టీఆర్ ఫ్యాన్స్ నడుమ వైరల్ గా మారింది. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించగా ఈ మార్చ్ 27న గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది.
????????祝デーヴァラ日本公開????????
インドのファンが建物の上からざばーって垂れ幕を下ろすアレに憧れて、ミニ垂れ幕を作りました。@devaramovie_jp. #DEVARA #デーヴァラ #DevaraInJapan pic.twitter.com/FjAP0hbuce
— ???????? ぼらこ నా పేరు నావోరి / Nickname:Shilpa (@QUEENjiyko) March 21, 2025