యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం లో దేవర పార్ట్1 చిత్రాన్ని చేస్తున్నారు. ఈ చిత్రం పూర్తి కాకముందే, బాలివుడ్ స్టార్ హీరో అయిన హృతిక్ రోషన్‌తో కలిసి తన బాలీవుడ్ అరంగేట్రం వార్ 2 షూటింగ్‌లో చేరారు. నిన్న సాయంత్రం ఎన్టీఆర్, స్టార్ జంట రణబీర్ కపూర్ మరియు అలియా భట్, హృతిక్ రోషన్, అతని స్నేహితురాలు సబా ఆజాద్ మరియు కరణ్ జోహార్‌లతో కలిసి చిక్ రెస్టారెంట్ వద్ద కనిపించారు. వారి డిన్నర్ డేట్ కి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
అభిమానులు మరియు మీడియాలో ఈ ఫోటోలు ఉత్సాహాన్ని రేకెత్తించాయి. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన రణబీర్ కపూర్ మరియు అలియా భట్ నటించిన బ్రహ్మాస్త్ర చిత్రానికి కరణ్ జోహార్ నిర్మాత. ముఖర్జీ చేస్తున్న తాజా చిత్రం వార్ 2. హృతిక్ మరియు జూనియర్ ఎన్టీఆర్‌లు ఇందులో నటిస్తున్నారు. ముఖ్యంగా హృతిక్ రోషన్, ఎన్టీఆర్ లను ఒకే ఫ్రేమ్ లో చూడటానికి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.