మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటించిన భారీ పాన్ ఇండియా సినిమా “దేవర” తో సెన్సేషనల్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా తర్వాత పెద్దగా గ్యాప్ తీసుకోకుండానే తారక్ వెంటనే మరో భారీ ప్రాజెక్ట్ “వార్ 2” లోకి వెళ్ళిపోయాడు. మరి బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ కూడా నటిస్తున్న ఈ సినిమాపై అయితే తారా స్థాయి అంచనాలు ఉన్నాయి.
మరి ఈ సినిమా షూటింగ్ ఇపుడు శరవేగంగా జరుగుతుండగా లేటెస్ట్ గా అయితే తారక్ పై కొన్ని లుక్స్ వైరల్ గా మారాయి. సినిమా సెట్స్ నుంచి తారక్ మంచి స్టైలిష్ అండ్ రగ్గుడ్ లుక్ లో కనిపిస్తున్న ఫోటోలు లీక్ అయ్యాయి. దీనితో వెంటనే ఎక్స్ లో వార్ 2 ట్యాగ్ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఇలా లీక్ అయ్యిన ఎన్టీఆర్ ఫొటోస్ అయితే సోషల్ మీడియాని ఒక్కసారిగా షేక్ చేసాయి. ఇక ఈ చిత్రానికి బ్రహ్మాస్త్ర ఫేమ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తుండగా వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్ కి రాబోతుంది.