వైరల్: “వార్ 2” కోసం మళ్ళీ మాస్ లుక్ లోకి తారక్!

వైరల్: “వార్ 2” కోసం మళ్ళీ మాస్ లుక్ లోకి తారక్!

Published on Oct 19, 2024 3:13 PM IST

ప్రస్తుతం మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటించిన తన లేటెస్ట్ చిత్రం “దేవర” తో తాను కోరుకున్న భారీ సక్సెస్ ని తాను అందుకున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా సక్సెస్ తో తారక్ కూడా ఫుల్ జోష్ లో ఉన్నాడు. అయితే ఈ సినిమా అనంతరం తన ఫోకస్ అంతటినీ తారక్ భారీ మల్టీ స్టారర్ చిత్రం వార్ 2 పైకి షిఫ్ట్ చేసాడు. అలా మళ్ళీ వార్ 2 కొత్త షెడ్యూల్ కోసం అయితే నేడు ఫ్లైట్ ఎక్కాడు.

మరి ఈ ప్రయాణంపై కొన్ని విజువల్స్ అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇందులో తారక్ ప్రిపేర్ చేసిన సాలిడ్ మాస్ లుక్ అయితే ఇప్పుడు ఫ్యాన్స్ ని ఎగ్జైట్ చేస్తుంది. మరి ఇందులో తారక్ గడ్డంతో మంచి రగ్గుడ్ లుక్ లో కనిపించడం జరిగింది. దీనితో వార్ 2 లో కూడా మామూలు మాస్ ట్రీట్ ఉండదు అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఇక ఈ చిత్రాన్ని బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తుండగా వచ్చే ఏడాది స్వాతంత్ర దినోత్సవ కానుకగా రిలీజ్ కాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు