ఫోటో మూమెంట్: ‘దేవర’ ప్రమోషన్స్ కోసం చెన్నై పయనమైన తారక్

ఫోటో మూమెంట్: ‘దేవర’ ప్రమోషన్స్ కోసం చెన్నై పయనమైన తారక్

Published on Sep 17, 2024 5:07 PM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ.ఎన్టీఆర్ ప్రస్తుతం ‘దేవర’ చిత్ర ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. ఈ ప్రెస్టీజియస్ మూవీని పాన్ ఇండియా సినిమాగా పలు భాషల్లో గ్రాండ్ స్కేల్‌తో రిలీజ్ చేయబోతున్నారు. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ఈ యాక్షన్ డ్రామా మూవీలో తారక్ డ్యుయెల్ రోల్‌లో నటిస్తున్నాడు.

ఇక రీసెంట్‌గా ముంబైలో దేవర చిత్ర ప్రమోషన్స్‌లో పాల్గొన్న తారక్, ఇప్పుడు తమిళనాట ఈ చిత్రాన్ని ప్రమోట్ చేసేందుకు బయల్దేరాడు. ‘దేవర’ చిత్ర ఆడియో లాంఛ్ ఈవెంట్ నేడు సాయంత్రం 7 గంటలకు చెన్నైలో గ్రాండ్‌గా నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా తారక్ చెన్నైకి పయనమవుతున్న సందర్భంగా ఇలా కెమెరాలకు చిక్కాడు.

దేవర సినిమాలో అందాల భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు