థాయ్‌లాండ్ నుండి తిరిగొచ్చిన ఎన్టీఆర్

కొరటాల శివ దర్శకత్వంలో ‘యంగ్ టైగర్ ఎన్టీఆర్’ హీరోగా రాబోతున్న పాన్ ఇండియా సినిమా ‘దేవర పార్ట్ 1’. ఈ సినిమా చిత్రబృందం ఇటీవల రొమాంటిక్ పాటను చిత్రీకరించడానికి థాయ్‌లాండ్‌కు బయలుదేరిన సంగతి తెలిసిందే. ఐతే, ఈరోజు, జూనియర్ ఎన్టీఆర్ మరియు తారక్ ఫ్యామిలీ మెంబర్స్ షూటింగ్ నుండి తిరిగివస్తూ, హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కనిపించారు. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ గా మారాయి.

ఇక కొంత విరామం తర్వాత, తారక్, దేవర చిత్రీకరణలో మళ్లీ బిజీ కానున్నాడు. దేవర సినిమా సెప్టెంబర్ 27, 2024న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. మొత్తానికి దేవర సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో షైన్ టామ్ చాకో, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు

Exit mobile version