మన టాలీవుడ్ లో మోస్ట్ డెడికేటెడ్ హీరోలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఒకరు. తన సినిమా కెరీర్ లో తాను తన ఫిట్నెస్ పట్ల చూపించిన మార్పు అయితే చాలా మందికి ప్రేరణగా నిలిచింది. మరి ఇప్పుడు ఒక సాలిడ్ లుక్ లోకి మారిన ఎన్టీఆర్ తన సినిమా సినిమాకి కూడా మరిన్ని స్టైల్స్ మార్చడం స్టార్ట్ చేసాడు.
లేటెస్ట్ గా తన భారీ సినిమా “రౌద్రం రణం రుధిరం” కి కొమరం భీం గా ఒక రఫ్ లుక్ లోకి మారిన తారక్ నెక్స్ట్ కొరటాల శివ సినిమాకి గాను కంప్లీట్ లుక్ ని మార్చేశాడు. లేటెస్ట్ గా అయితే ఒక ఫ్రెష్ లుక్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మంచి ట్రిమ్డ్ లుక్ లోకి వచ్చి సరికొత్త స్టైల్ లో కనిపిస్తున్నాడు.
అయితే ఇది కొరటాల శివతో సినిమాకేనా కాదా అనేది కన్ఫర్మ్ కాలేదు కానీ సోషల్ మీడియాలో అయితే ఈ లేటెస్ట్ ఫోటో మంచి వైరల్ గా మారింది. ఇక ఈ కాంబోలో సినిమాకి ఓ బాలీవుడ్ హీరోయిన్ ఫిక్స్ కాగా త్వరలోనే కొరటాల ఈ సినిమాని స్టార్ట్ చెయ్యనున్నారు.


