ఆ విషయం విడుదలయ్యాకే తెలిసిందట !

ఎన్టీఆర్‌ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘దేవర’. ఐతే, ఆయుధపూజ పాటలో సీనియర్ ఎన్టీఆర్ స్టెప్స్ గుర్తు వచ్చేలా తారక్ స్టెప్స్ వేసిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్, ఆ స్టెప్స్ గురించి, అలాగే ఆయుధపూజ పాట గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ‘ఆయుధపూజ పాటలో తాతగారిని ఇమిటేట్‌ చేయాలని అనుకోలేదు. అసలు ఆ పాటలో ఆ స్టెప్‌ తాతగారి స్టెప్ లా ఉందని కూడా మొదట మేం గుర్తించలేదు. ఆ స్టెప్ విషయం పాట విడుదలైన తర్వాత ఫ్యాన్స్‌ అంటేనే తెలిసింది’ అని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.

ఎన్టీఆర్ ఆయుధపూజ పాట గురించి ఇంకా మాట్లాడుతూ.. ‘ఆయుధపూజ పాటను చాలా తక్కువ సమయంలో చేయాల్సి వచ్చింది. ఎందుకంటే అనిరుధ్‌ అప్పుడు అమెరికా పర్యటనలో ఉన్నాడు. కేవలం రెండు రోజుల్లో పాట షూటింగ్‌ ఉందనగా ఫోన్‌ చేసి ట్యూన్‌ ఇవ్వడం జరిగింది. రామజోగయ్యశాస్త్రి కేవలం గంటలోనే రాశారు. అందుకే ఆయన్ను సరస్వతి పుత్రుడు అన్నారు’ అని ఎన్టీఆర్ కామెంట్స్ చేశారు. కాగా కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్, జాన్వీ కపూర్, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, అజయ్, మురళీ శర్మ కీలక పాత్రల్లో నటించారు. అనిరుధ్ మ్యూజిక్ అందించారు.

Exit mobile version