Devara: ఎన్టీఆర్ విలయ తాండవం..వరల్డ్ వైడ్ “దేవర” రికార్డు ఓపెనింగ్స్

Devara: ఎన్టీఆర్ విలయ తాండవం..వరల్డ్ వైడ్ “దేవర” రికార్డు ఓపెనింగ్స్

Published on Sep 28, 2024 1:00 PM IST

మన తెలుగు సినిమాలో భారీ మాస్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోస్ లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కూడా ఒకరు అని తెలిసిందే. మరి దీనితోనే టాక్ తో సంబంధం లేకుండా ఎన్టీఆర్ డే 1 ఓపెనింగ్స్ కి రికార్డుగా పెట్టడం ఎప్పటి నుంచో ఆనవాయితీగా పెట్టుకున్నాడు. మరి ఇప్పుడు మరోసారి తాను రికార్డు ఓపెనింగ్స్ లో కింగ్ ని ఎందుకు అంటారో మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడని చెప్పాలి. లేటెస్ట్ గా వచ్చిన తన సెన్సేషనల్ సినిమా “దేవర” కోసం తెలిసిందే.

ఈ చిత్రం అనుకున్నట్టుగానే ఎన్టీఆర్ కెరీర్ టాలీవుడ్ నుంచి మరో బిగ్గెస్ట్ ఓపెనర్ గా రికార్డు సాధించింది. ఇలా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా ఏకంగా 172 కోట్ల గ్రాస్ ని అందుకొని ఈ ఏడాదిలో మరో బిగ్గెస్ట్ ఓపెనర్ గా ఇండియా వైడ్ గా నిలిచింది. దీనితో బాక్సాఫీస్ దగ్గర ఎన్టీఆర్ తాండవం ఏ రీతిలో ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ వీకెండ్ కి దేవర ఈజీగా 300 కోట్ల మార్క్ ని దాటేసిన ఎలాంటి ఆశ్చర్యం లేదనే చెప్పాలి. మరి చూడాలి దేవర ఎలాంటి నంబర్స్ ని ఖాతాలో వేసుకుంటుందో అనేది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు