జూనియర్ బాలకృష్ణ ఇక లేడు !

జూనియర్ బాలకృష్ణ ఇక లేడు !

Published on Oct 18, 2019 4:08 PM IST

బాలయ్య బుల్లి అభిమాని, అచ్చం బాలయ్య లాగే డైలాగ్ లు చేప్పే చిన్న పిల్లడు గోకుల్ ఇక లేరు. డెంగ్యూ వ్యాధితో చిన్న వయసులోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లడం చాల బాధాకరమైన విషయం. కాగా ఈ విషయం తెలిసి బాలకృష్ణ స్పందించారు. ‘మాకు అభిమానుల కంటే విలువైనది మరొకటి ఉండదు. అలాంటి చిన్నారి అభిమాని గోకుల్. నేనంటే ప్రాణం ఇచ్చే ఈ చిన్నారి ఈ రోజు ప్రాణాలతో లేడన్న నిజం నా మనసును కలచివేసింది. అతడు డైలాగులు చెప్పిన విధానం.. హావభావాలు చూసి నాకు ఎంతో ముచ్చటేసేది.

ఎంతో భవిష్యత్తు ఉన్న ఈ చిన్నారి ఇంత చిన్న వయసులో డెంగ్యూ వ్యాధితో ఈ లోకాన్ని విడిచి వెళ్లడం చాలా బాధ కలిగించింది. ఈ చిన్నారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ.. అతని కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను – మీ నందమూరి బాలకృష్ణ’ అని సోషల్ మీడియా ద్వారా తన సానుభూతిని తెలియజేశారు. 123తెలుగు.కామ్ తరఫున ‘బాలయ్య అభిమాని గోకుల్’ మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు