వైయస్సార్ స్థాయిని పెంచదు… ఎన్టీఆర్ స్థాయిని తగ్గించదు – జూనియర్ ఎన్టీఆర్!

Published on Sep 22, 2022 7:09 pm IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు పై అధికార పార్టీ మరియు ప్రతి పక్ష పార్టీ నేతలు ఒకరి పై ఒకరు విమర్శలు చేస్తున్నారు. అయితే యూనివర్సిటీ పేరు మార్పు పై తాజాగా జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదిక గా పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

ఎన్టీఆర్, వైఎస్సార్ ఇద్దరూ విశేష ప్రజాదరణ సంపాదించిన నాయకులు. ఈ రకం గా ఒకరి పేరు తీసి ఒకరి పేరు పెట్టడం ద్వారా తెచ్చే గౌరవం వైఎస్సార్ స్థాయిని పెంచదు, ఎన్టీఆర్ స్థాయిని తగ్గించదు. విశ్వ విద్యాలయానికి పేరు మార్చడం ద్వారా ఎన్టీఆర్ సంపాదించుకున్న కీర్తిని, తెలుగు జాతి చరిత్రలో వారి స్థాయిని, తెలుగు ప్రజల హృదయాలలో ఉన్న వారి జ్ఞాపకాలని చెరిపి వేయలేరు అంటూ జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు కొద్ది సేపటికే హాట్ టాపిక్ గా మారాయి. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీ హీరోగా మారిపోయారు.

సంబంధిత సమాచారం :