నెట్ ఫ్లిక్స్ సీఈఓ తో ఎన్టీఆర్…ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్!

నెట్ ఫ్లిక్స్ సీఈఓ తో ఎన్టీఆర్…ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్!

Published on Dec 8, 2023 6:00 PM IST


యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ మూవీ తో వరల్డ్ వైడ్ గా సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం లో దేవర అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నారు. ఈ క్రేజీ మూవీ పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా సోషల్ మీడియా లో జూనియర్ ఎన్టీఆర్ ఒక ఆసక్తికరమైన పోస్ట్ ను షేర్ చేశారు.

నెట్ ఫ్లిక్స్ సీఈఓ అయిన టెడ్ సరండోస్ ను ఇంటికి పిలిచి, ఆతిథ్యం అందించారు. టెడ్ సరండోస్ కి, అతని టీమ్ ను హోస్ట్ చేయడం ఆనందం గా ఉంది అని ఎన్టీఆర్ పేర్కొన్నారు. అతనితో కొన్ని విషయాలను చర్చించినట్లు తెలిపారు. అందుకు సంబందించిన ఫోటోలను జూనియర్ ఎన్టీఆర్ షేర్ చేశారు. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు