రజిని పక్కన చంద్రముఖి చేస్తుందా…!

రజిని పక్కన చంద్రముఖి చేస్తుందా…!

Published on Oct 16, 2019 10:11 AM IST

తలైవా రజినీ గతంతో పోల్చుకుంటే వేగం పెంచారు. ఆయన ఒక ప్రాజెక్ట్స్ సెట్స్ పై ఉండగానే మరో కొత్త చిత్రాన్ని ప్రకటించేస్తున్నారు. ప్రస్తుతం ఆయన నటించిన దర్బార్ మూవీ చిత్రీకరణ దశలో ఉండగా, తాజాగా మాస్ చిత్రాల దర్శకుడు శివ తో మూవీ చేస్తున్నట్లు ప్రకటించారు. గతంలో రజినీతో రాబో, పేట వంటి చిత్రాలు తెరకెక్కించిన సన్ పిక్చర్స్ ఈ మూవీని నిర్మిస్తుంది. కాగా ఈ చిత్రంలో హీరోయిన్స్ గా నటి జ్యోతిక మరియు మంజు వారియర్ పేర్లు పరిశీలిస్తున్నారట దర్శక నిర్మాతలు. 168వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ మూవీలో రజిని పాత్రకు జంటగా వీరైతే బాగుంటుందని భావిస్తున్నారట.

గతంలో రజిని నటించిన సూపర్ హిట్ మూవీ చంద్రముఖి చిత్రంలో జ్యోతిక కీలకపాత్ర చేశారు. మరి ఈ ఇద్దరు హీరోయిన్స్ లో ఎవరికి ఆ అదృష్టం దక్కుతుందో చూడాలి. దర్బార్ షూటింగ్ నుండి బ్రేక్ తీసుకున్న రజిని ఉత్తర భారత యాత్రలో ఉన్నారు.ఇప్పటికే రిషికేష్ పుణ్యక్షేత్రాన్ని సందర్శించిన రజిని హిమాలయాలకు వెళ్లనున్నారని వినికిడి. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో రజిని సరసన నయనతార నటించగా, వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల అవుతున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు